అల్లు అర్జున్ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టైలిష్ స్టార్ డాన్స్ కి, యాక్షన్ కి, స్టైల్ కి చాలా క్రేజ్ ఉంది. అందుకే ఇప్పుడు పుష్ప తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అవుతోంది. అంతే కాకుండా బుట్ట బొమ్మ, రాములో రాములా, టాప్ లేసిపోద్ది పాటలు నార్త్ లో కూడా బాగా వినిపిస్తాయి.

1 allu arjun

అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ పాట సీటిమార్ ని ఇప్పటికే ఆల్రెడీ బాలీవుడ్ లో రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమా కోసం ఈ పాటని హిందీ రీమేక్ చేశారు. ఇప్పుడు ఇవాళ జరిగిన ఒక ఘటన చూస్తే అల్లు అర్జున్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ హిందీ లో రీమేక్ కాబోతోందనే అనుమానాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, హీరోయిన్ పూజా హెగ్డే ఇవాళ ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చారు.

అందులో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ “మేడం మన సర్కస్ సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ షూట్ కి రండి” అని కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ చూస్తే, అందులోనూ ఇందులో ఉన్న పాట పేరు చూస్తే, అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలోని బ్లాక్ బస్టర్ పాట గుర్తొస్తోంది. మరి నిజంగా ఇది మన పాటేనా? లేదా ఈ సినిమాలో అదే పేరుతో ఒరిజినల్ గా వేరేది కంపోజ్ చేశారా? ఇది మాత్రం తెలియదు.