సలార్ సినిమాలో “ప్రభాస్” తో పాటు… మరొక ప్యాన్-ఇండియన్ స్టార్..?

సలార్ సినిమాలో “ప్రభాస్” తో పాటు… మరొక ప్యాన్-ఇండియన్ స్టార్..?

by Mohana Priya

Ads

ఇటీవల కాలంలో ప్యాన్ ఇండియా మూవీస్, ప్యాన్ ఇండియన్ హీరోస్ అనే ట్యాగ్స్ ఎక్కువ అయిపోయాయి. అందులోనూ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1,2 సినిమాల తర్వాత ఈ టాక్ మరింత పెరిగింది. దీంతో ప్రభాస్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

Video Advertisement

కానీ బాహుబలి తర్వాత వచ్చిన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో, రాధే శ్యామ్ సినిమాలు అంతగా ఆడలేదు. అయినప్పటికీ వాటిపై ప్రజలకి ఆసక్తి తగ్గలేదు.

salaar movie prabhas entry scene dialogue leaked

ఎప్పుడైనా సరే ప్రభాస్ ఉంటే చాలు అభిమానుల హంగామా తారా స్థాయిలోనే ఉంటుంది. ఇదే రీతిలో తరువాత రానున్న సాలార్ మూవీపై కూడా అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. అసలు ఒక్క ప్యాన్ ఇండియా స్టార్ ఉన్న సినిమా అయితేనే సినిమాల హాల్ లో సందడి చాలా ఉంటుంది. అలాంటిది ఆల్రెడీ పిచ్చి క్రేజ్ అండ్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ సాలార్ లో మరో ప్యాన్ ఇండియా స్టార్ ఎంట్రీ ఇస్తే ఇంకేమైనా ఉందా!! అంటూ విషయం తెలిసిన అభిమానులు నోరు తెరుచుకుని మరీ షాక్ అవుతున్నారు.

అయితే విక్రమ్ సినిమా మాదిరిగా, చివరిలో సూర్య ఎంట్రీ ఇచ్చినట్టు… సాలార్ లో కూడా ఒక ప్యాన్ ఇండియా స్టార్ట్ ఎంట్రీ ఇవ్వనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి మరెవరో కాదు సెకండ్ ప్యాన్ ఇండియా స్టార్, కీజీఎఫ్ హీరో యశ్ అనే చర్చలు రాబోతున్నాడని చర్చలు నడుస్తున్నాయట. మామూలుగా యశ్ ఒక్కడు ఎంట్రీ ఇస్తేనే బ్యాక్ గ్రౌండ్ దద్ధరిల్లి పోతుంది. అలాంటిది ప్రభాస్, యశ్ కలిసి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఊహ ప్రేక్షకులకి అంతు చిక్కట్లేదు. దీంతో సాలార్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అనే ఆసక్తిని చూపుతున్నారు అభిమానులు.


End of Article

You may also like