బాహుబలి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ గురించి ఎన్నో సార్లు గొప్పగా చెప్పారు. అలాగే ఇతర భాషల సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ అని ఎన్నో సార్లు చెప్పారు. ప్రభాస్ గత కొన్ని సంవత్సరాలలో ఎన్నో అరుదైన ఘనత లు సంపాదించారు. అలాగే ఎన్నో రికార్డ్స్ కూడా నెలకొల్పారు. ఇప్పుడు ప్రభాస్ మరొక అరుదైన గుర్తింపు సంపాదించారు.

prabhas

ఫాన్సీ ఆడ్స్ వాళ్ళు నిర్వహించిన టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్ సర్వేలో మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఆన్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఆన్ ఎర్త్ గా మొదటి స్థానంలో నిలిచారు ప్రభాస్.  అలా మరొక అరుదైన గుర్తింపు సంపాదించుకున్నారు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాతో పాటు, రాధే శ్యామ్ అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ లో నటిస్తున్నారు.