Ads
సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళకి చదువు బుర్రకు ఎక్కదు అని అంటూ ఉంటారు. కానీ అది తప్పు అని నిరూపించింది అనుష్క సేన్. బాలనటిగా సీరియల్స్తో పరిచయమయ్యి, మహేంద్ర సింగ్ ధోనీ తో పాటు ఒక ఫ్యాన్ అడ్వటైజ్మెంట్ లో నటించిన అనుష్క తర్వాత ఝాన్సీ కి రాణి, దేవోంకే దేవ్ మహాదేవ్ సీరియల్స్ లో నటించింది.
Video Advertisement
ప్రస్తుతం ఎన్నో మ్యూజిక్ వీడియో లలో కూడా నటిస్తోంది అనుష్క. ఇది ఇలా ఉంటే అనుష్క 12వ తరగతి పరీక్షలు రాసింది. CBSE బోర్డు ఇటీవల ఫలితాలను విడుదల చేసింది. అందులో అనుష్క 89.4 శాతం మార్కులు సాధించింది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను అందరితో పంచుకుంది అనుష్క.
ఈ వార్తను చూసిన నెటిజన్లు నటనలోనే కాకుండా చదువులో కూడా ముందున్నందుకు అనుష్క ను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా చదువుకి నటనకి ఒకే రకంగా ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అని అభినందిస్తున్నారు.
ఈ విషయంపై అనుష్క మాట్లాడుతూ ” నిజానికి ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి అనుకున్నాను. కానీ షూటింగ్ లో బిజీ గా ఉండటంవల్ల అనుకున్నంత సాధించలేకపోయాను. కానీ ఏదేమైనా ఇంత మంచి ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది.
ఇందుకు సహకరించిన మా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, టీచర్లకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేకాకుండా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను చదువుకునేందుకు సహకరించిన నా సీరియల్ యూనిట్ కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళ అందరి ప్రోత్సాహం తో నేను నా స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజ్ చదువు ప్రారంభించబోతున్నాను” అని చెప్పింది.
End of Article