విశాఖపట్నంలో ఓ యువతీ అనుమానాస్పదంగా మరణించడం జరిగింది.మృతురాలితో కలిసి ఉంటున్న మరో మహిళా సహజ మరణంగా ఘటనను చిత్రీకరించింది.కానీ స్మశానంలో ఉండే కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

కొంతకాలం క్రితం విశాఖపట్నం ,అక్కయ్యపాలెం చెక్కుడురాయి ప్రాంతంలో ఉంటున్న వసంత అనే మహిళా కు 22 యేళ్ళ దివ్య పరిచయం అయ్యింది.వసంత భర్త దుబాయ్ లో ఉండడంతో దివ్య వసంతతోనే కలిసి నివాసం ఉండేది.అయితే హఠాత్తుగా ఏమైందో ఏమో దివ్య ఫిట్స్ వచ్చి మృతి చెందింది అంటూ వసంత తన బందువులకు సమాచారం అందించింది.దీంతో వసంత బంధువులు అందరూ వచ్చి దివ్య మృత దేహాన్ని పువ్వులతో కప్పేశారు.ఒక్కసారిగా ఇలా జరగడంతో చుట్టుపక్కలవారికి కూడా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు .

representative image

స్మశాన కాపరికి కూడా ఇంత చిన్న వయస్సులో ఫిట్స్ తో మృతి చెందడం ఏంటి అని అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు.దీంతో అప్రమత్తమైన ఎస్ఐ సూర్యనారాయణ చెక్కుడురాయి దగ్గర ఉన్న భవనాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా మృత దేహంపై సిగరెట్ తో కాల్చిన మచ్చలు మరియు జుట్టు కత్తిరించి ఉంచడం గమనించారు.దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రి కి తరలించి అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసారు.అయితే దివ్య మరణం వెనుక వ్యభిచార కోణం ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది అని కాగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్ఐ సూర్యనారాయణ అన్నారు.