ఇప్పటి వరకు మూవీ థియేటర్ లోనూ, టెలివిజన్ లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో ధూమపానం మరియు మద్యపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు ‘ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం’  అనే వార్నింగ్ ను వేయడం అందరికి తెలిసిన విషయమే.

Video Advertisement

ఇటీవల కాలంలో భారత్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓటీటీలకు ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెడుతూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం  ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే  కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్  సిరీస్, పాడ్‌కాస్ట్‌లు వంటి ఇతర కంటెంట్‌కు కూడా వర్తిస్తాయి.

Also Read: PACHUVUM ATHBUTHA VILAKKUM REVIEW : “ఫ‌హాద్ ఫాజిల్” హీరోగా నటించిన ప‌చ్చువుమ్ అద్భుత విళక్కుం ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!