Ads
జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు కొన్నిసార్లు మంచి చేస్తే మరికొన్నిసార్లు అపాయాన్ని తీసుకువస్తాయి.అయితే అనుకోకుండా ఒక వ్యక్తి కి మిస్డ్ కాల్ వలన ఓ పెళ్లి అయిన మహిళా పరిచయం అయింది.కాగా ఆ పరిచయమే అతని మరణానికి దారితీసింది..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
కర్ణాటక రాష్ట్రం ,బెంగుళూరులో నివాసం ఉండే 20 యేళ్ళ చంద్రశేఖర్ కు అతని దగ్గర ప్రాంతంలో నివాసం ఉండే ఒక మహిళ మిస్డ్ కాల్ వలన పరిచయం అయింది.అయితే ఇద్దరు తరుచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు అలాగే చాటింగ్ కూడా చేసుకునేవారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.దీంతో ఆ మహిళ చంద్రశేఖర్ దగ్గరకి వెళ్ళిపోయింది.ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త తిరిగి తన భార్య ను తన ఇంటికి తీసుకెళ్లాడు.
అయితే కొన్నిరోజులు బాగానే ఉన్న ఆ మహిళ మళ్ళీ చంద్రశేఖర్ తో ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టి మళ్ళీ చంద్రశేఖర్ దగ్గరకి వెళ్ళిపోయింది ఆ మహిళ.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన ఆ మహిళ భర్త చంద్రశేఖర్ ఎక్కడ ఉంటాడో తెలుసుకొని అక్కడికి వెళ్లి చంద్రశేఖర్ పై దాడికి పాల్పడ్డాడు.ఆ దాడిలో తీవ్ర గాయాలైన చంద్రశేఖర్ మృతి చెందాడు.కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెయ్యడం ప్రారంభించారు.
End of Article