మలయాళం సినిమా ప్రేమమ్ తో తన కెరీర్ మొదలు పెట్టి తర్వాత ఎన్నో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించారు అనుపమ పరమేశ్వరన్. తెలుగులో  అఆ, శతమానం భవతి, తేజ్ ఐ లవ్ యు, రాక్షసుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇవి మాత్రమే కాకుండా అనుపమ ఒక మలయాళం సినిమాకి సహాయ దర్శకత్వం కూడా వహించారు.

anupama parameswaran

అయితే ఇప్పుడు అనుపమ మరొక గుర్తింపును సంపాదించుకున్నారు. కలకత్తా కల్ట్ ఫిలిం ఫెస్టివల్ వాళ్లు అనుపమని ఉత్తమ నటి అవార్డుతో సత్కరించారు. అనుపమ హీరోయిన్ గా నటించిన షార్ట్ ఫిలిం ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ కి ఈ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని అనుపమ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు.

అలాగే ఈ షార్ట్ ఫిలింకి ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డ్ వచ్చింది. దాంతో నెటిజన్లు అనుపమ పరమేశ్వరన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.