కుమారి ఆంటీ తర్వాత ఫుడ్ బిజినెస్ లో ఫేమస్ అయిన మరొక ఆవిడ ఎవరో తెలుసా..? ఇక్కడ ఒక ప్లేట్ ధర ఎంతంటే..?

కుమారి ఆంటీ తర్వాత ఫుడ్ బిజినెస్ లో ఫేమస్ అయిన మరొక ఆవిడ ఎవరో తెలుసా..? ఇక్కడ ఒక ప్లేట్ ధర ఎంతంటే..?

by kavitha

Ads

కుమారి ఆంటీ పేరు ఇటీవల కాలంలో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. హైదరాబాద్‌లో కేబుల్‌ బ్రిడ్జి ప్రాంతంలో  ఫుడ్‌ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీ ఫేమస్ అయింది. ఎంతగా అంటే ఆమె బిజినెస్ ని ట్రాఫిక్ సమస్య వల్ల పోలీసులు క్లోజ్ చేయిస్తే, ఏకంగా ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. ఆయన ఆదేశంతో మళ్ళీ ఆమె షాప్ తెరుచుకున్న సంగతి తెలిసిందే.

Video Advertisement

ఆమె తరువాత ఆ ప్రాంతంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫేమస్ అయిన ఆంటీ పేరు అనురాధ. హైదరాబాద్ లోని ఐటీసీ కోహెనూర్ హోటల్‌ మరియు  ఇనార్బిట్ మాల్ దగ్గరలో అనురాధ ఆంటీ ఫుడ్ బిజినెస్ సెంటర్ ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫుడ్ కు ఫేమస్ అయిన హైదరాబాద్ లో ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్‌ బిజినెస్ లు బాగా పెరిగిపోయాయి. ఆ ఫుడ్ కి రోజు రోజుకి అభిమానులు పెరిగిపోటున్నారు. రోడ్డు పక్కన మంచి రుచికరమైన ఫుడ్ దొరకడం, అది కూడా చాలా తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటి దగ్గరకి జనాలు క్యూ కడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా కుమారి ఆంటీ పేరు చెప్పుకోవచ్చు. ఆమె ఫుడ్ బిజినెస్ తో చాలా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఏక్కడ చూసిన ఆమె గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. అయితే అదే ప్రాంతంలో అనురాధ ఆంటీ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
ఆమె స్టాల్ లో టేస్టీ దాల్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, జీరా రైస్, టమాటా రైస్, పెరుగన్నం అందుబాటులో ఉన్నాయి. ఇక నాన్ వెజ్ లో మటన్, చికెన్, లివర్, ఫిష్, తలకాయ, ఫ్రాన్స్ వంటి కర్రీస్ ఉంటాయి. వెజ్ ప్లేట్‌కు 80 రూపాయలు కాగా,  రైస్ అన్‌లిమిటెడ్ గా ఉంది. చికెన్ కర్రీ రూ.120 (అన్‌లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్ ),చికెన్ ఫ్రై రూ.150 (అన్‌లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), మటన్ కర్రీ –రూ.200 (అన్‌లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), లివర్‌ కర్రీతో రైస్ 150 రూపాయలు, ప్రాన్స్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ఫిష్ కర్రీతో రైస్ 150 రూపాయలు,కాగా నాన్ వెజ్ ఐటమ్స్‌ అన్నింటితో కలిపి తీసుకుంటే 450 రూపాయలు.
ఆమె వద్ద రోజుకు మూడు వందల మంది దాకా ఫుడ్ తింటారు. ఆ లెక్కన ఒక్కోక్కరికి యావరేజ్ గా రూ. 100 చొప్పున రోజుకు 30000 వస్తుంది. ఖర్చులన్ని పోగా 10 వేల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చూస్తే నెలకు మూడు లక్షల దాకా ఆమెకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరకు వందల మందికి  ఆహారం అందిస్తున్న ఇలాంటి మహిళలను అందరు మెచ్చుకుంటున్నారు.

Also Read: సాయి కుమారి ఫుడ్ స్టాల్ సంఘటనలో 2 వాదనలు..? మీరు ఎటు వైపు సమర్ధిస్తారు..?

 


End of Article

You may also like