Home Filmy Adda సమీర్ మాటలకి ఉలిక్కిపడ్డ అనసూయ.! వీడియో వైరల్!

సమీర్ మాటలకి ఉలిక్కిపడ్డ అనసూయ.! వీడియో వైరల్!

by Mohana Priya

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ఒక ముఖ్యమైన విషయం మా ఎలక్షన్స్. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పదవి కోసం ఎంతో మంది సినీ ప్రముఖులు పోటీ పడ్డారు. వారిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క సెలబ్రిటీకి ఒక ప్యానెల్ ఉంది. వారిలో కూడా చాలా మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. పోటీ పడుతున్న సెలబ్రిటీలు అందరూ తమదైన శైలిలో ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో మీడియా సమావేశాలకు హాజరు అయ్యి, ఇంటర్వ్యూలు ఇచ్చి, సినిమా రంగానికి వారు ఏమి చేయగలరు అనేది కూడా చెప్పారు. అలా ఎంతో ఉత్కంఠగా జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు గెలిచారు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నటుడు సమీర్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. సమీర్ పక్కన నటి అనసూయ కూర్చొని ఉన్నారు. సమీర్ ఒక్కసారి గట్టిగా మాట్లాడడం తో అనసూయ ఉలిక్కిపడ్డారు. తర్వాత మళ్ళీ తేరుకొని మామూలు అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

https://www.youtube.com/watch?v=CZiIcn9Fs5w

You may also like