Ads
అక్రమ సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా విలాసాల కోసం తమ సంతోషాల కోసం మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఓ అక్రమ సంబంధం వల్ల అన్యం పుణ్యం ఎరుగని ఓ చిన్నారి మరియు అతని తండ్రి నిర్జీవులు అయ్యారు.
Video Advertisement
తెలంగాణ భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనూష అనే అమ్మాయిని 2011లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.వీరికి 2015 లో ఆద్య అనే అమ్మాయి జన్మించింది.గత రెండు సంవత్సరాలుగా దంపతులిద్దరూ ఇస్మాయిల్ ఖాన్‌గూడలో నివాసం ఉంటున్నారు.ఈ సమయంలో అక్కడే నివాసముంటున్న కరుణాకర్ అనే అబ్బాయితో అనూషకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇటీవల కరుణాకర్ ప్రవర్తన లో తేడా రావడంతో అనూష రాజశేఖర్ అనే మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది.తనని అనూష దూరం పెట్టడం తట్టుకోలేకపోయిన కరుణాకర్ రాజశేఖర్ అనూష ఇంట్లో ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళాడు.అతన్ని వెంటనే బయటకు రమ్మని లేకుంటే అక్కడ ఆడుకుంటున్న ఆద్యను తను తెచ్చిన సర్జికల్ కత్తితో చంపేస్తానంటూ బెదిరించాడు.
అతని మాటను అనూష,రాజశేఖర్ పట్టించుకోకపోవడంతో ఆద్యను చంపి అక్కడి నుండి పారిపోయాడు.ఈ దుర్ఘటన జరిగిన వారం రోజుల్లోనే తండ్రి కళ్యాణ్ మానసికంగా కుంగిపోయి భువనగిరి రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో తప్పు ఒకరిది అయితే శిక్ష మరొకరికి పడింది. పాపం అభంశుభం ఎరుగని ఆ పసిపాపని పొట్టనబెట్టుకున్నారు. అయిదేళ్ల కూతురి దూరమయ్యేసరికి మానసికంగా కుంగిపోయి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు.
End of Article