అయ్యో గవాస్కర్ ఏంటి కోహ్లీ ఫెయిల్ అవ్వడంపై “అనుష్క” ని అంత మాట అనేసారు?

అయ్యో గవాస్కర్ ఏంటి కోహ్లీ ఫెయిల్ అవ్వడంపై “అనుష్క” ని అంత మాట అనేసారు?

by Mohana Priya

Ads

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడిన తీరుపై నెటిజన్లు తమ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కామెంట్రీ లో సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం చర్చలో ఉంది.

Video Advertisement

ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ బాటింగ్ సరిగా చేయకపోవడంతో అనుష్క శర్మ ఇంకా విరాట్ కోహ్లీ లాక్ డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతున్న వీడియో గురించి గుర్తు చేస్తూ కామెంట్ చేశారు సునీల్ గవాస్కర్.

https://twitter.com/abhijeet_dipke/status/1309397490018390017

“లాక్ డౌన్ లో అనుష్క బౌలింగ్ తో ప్రాక్టీస్ చేశారు అతను. ఆ వీడియో చూశాను. దాంతో ఏమీ అవ్వదు (Ab joh lockdown tha to sirf Anushka ki bowling ki practice ki unhone, wo video dekhi hai, usse to kuch nahi hona hai)” అని ఆ కామెంట్ యొక్క అర్థం. ఇక్కడ సునీల్ గవాస్కర్ మెన్షన్ చేసిన వీడియో బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్ లో తనని ఇన్వాల్వ్ చేయడంతో అనుష్క శర్మ స్పందించారు. సునీల్ గవాస్కర్ కామెంట్ పై అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశారు “మిస్టర్ గవాస్కర్, మీరు చేసిన కామెంట్ బాలేదు అనేది నిజం. కానీ అసలు మీరు అలా ఒక భర్త ఆటపై భార్య ని కారణంగా చూపిస్తూ కామెంట్ ఎందుకు చేశారు అనేది నేను వినాలి అనుకుంటున్నాను.

నాకు తెలుసు. ఎంతో కాలం నుండి మీరు కామెంట్ చేస్తున్నప్పుడు మీరు ప్లేయర్స్ ప్రైవేట్ లైఫ్ ని గౌరవించారు. నాపై ఇంకా మాపై కూడా సమానమైన గౌరవం ఉండాలి అని మీకు అనిపించట్లేదా? నాకు తెలిసి నా భర్త ఆటపై మీరు కామెంట్ చేసేటప్పుడు మీ మెదడులో ఎన్నో పదాలు, వాక్యాలు ఉండొచ్చు. లేదా నా పేరు వాడితేనే మీ పదాలు రిలవెంట్ గా ఉంటాయా?

ఇది 2020 (సంవత్సరం). కానీ నా విషయం మాత్రం మారలేదు. నన్ను క్రికెట్ లోకి లాగడం, ఇలాంటి కామెంట్స్ లో నా పేరు వాడటం ఎప్పుడు ఆపుతారు? రెస్పెక్టెడ్ మిస్టర్ గవాస్కర్, ఈ జెంటిల్మెన్ గేమ్ లో లెజెండ్స్ లో మీరు ఒకరు. మీరు ఈ మాట అనడం నేను విన్నప్పుడు నాకేం అనిపించిందో చెప్పాలనుకున్నాను అంతే” అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు అనుష్క శర్మ.


End of Article

You may also like