Home Filmy Adda బిల్లా షూటింగ్ సమయంలో ఎంతగానో బాధపడ్డాను.. ”అనుష్క” కామెంట్స్..!

బిల్లా షూటింగ్ సమయంలో ఎంతగానో బాధపడ్డాను.. ”అనుష్క” కామెంట్స్..!

by Megha Varna

ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అనుష్క శెట్టి. ఒకరకంగా చాలా సంవత్సరాల తర్వాత అరుంధతి సినిమాతో మళ్లీ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఇదే తరహాలో ఎన్నో పవర్ ఫుల్ పాత్రలు చేశారు అనుష్క. అనుష్క చివరిగా 2020 లో వచ్చిన నిశ్శబ్దం సినిమాలో నటించారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

anushka - naveen polisetty movie story resembles the recent releases..??

కానీ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ని కూడా చిత్ర యూనిట్ ఇవ్వలేదు. ఏది ఏమైనా అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రాలు రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి నిశ్శబ్దం. నిశ్శబ్దం చిత్రం అనుష్క అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత కూడా అనుష్క సినిమాల గురించి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో అనుమానాలు పెరిగాయి. బరువు కూడా పెరుగుతుండడంతో అనుష్క ఇక సినిమాలకు దూరం అవుతోందని చాలా రూమర్స్ వినిపించాయి.

ఇది ఇలా ఉంటే అనుష్క జీవితంలో ఎంతో సఫర్ అయ్యింది. దాని గురించి అనుష్క చెప్పింది. అనుష్క ‘బిల్లా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో బికినీ వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఈమె పడిందట. బిల్లా సినిమాలో గ్లామరస్ రోల్ చేసింది ఈమె. ఇలాంటి ఇబ్బందులు తన జీవితంలో పడ్డానని అంది.

You may also like