ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి కంటతడి పెట్టుకున్నారు. ఎక్కడున్నా హుషారుగా ఉండే ఆమె ఇలా కంటతడి పెట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా? నిన్న విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపైనే ఆమె వలవలా ఏడ్చేశారు.పక్కనే ఉన్న విజయసాయిరెడ్డి ఆమెను ఓదార్చారు. అయితే, ఆమె ఎందుకలా కన్నీరు పెట్టారో మాత్రం ఎవ్వరికి తెలియదు.

Video Advertisement

వేదికపైకి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విజయసాయిరెడ్డి, బొత్స, శ్రీనివాస్ సహా పలువురు ముఖ్య నాయకులను మాత్రమే పిలిచారు. ఆమె భర్త పరీక్షిత్ రాజును వేదిక మీదకి పిలవలేదు. ఈ కారణంగానే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి స్టేజ్ పైనే వలవలా ఏడ్చేశారని తెలుస్తోంది.పుష్పశ్రీవాణి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన వైసీపీ నాయకులు వెంటనే జోక్యం చేసుకున్నారు. అనంతరం పుష్పశ్రీవాణి భర్తను స్టేజీ మీదకు పిలిచారు. దీంతో ఆమె సంతృప్తి చెందారు.

watch video: