2024 ఏపీ 10 వ తరగతి ఫలితాల్లో టాపర్ 599 / 600 . ఆ ఒక్క మార్కు ఎందులో పోయిందంటే.?

2024 ఏపీ 10 వ తరగతి ఫలితాల్లో టాపర్ 599 / 600 . ఆ ఒక్క మార్కు ఎందులో పోయిందంటే.?

by Harika

Ads

ఆంధ్రప్రదేశ్ లో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన 2024 10వ తరగతి ఫలితాలు ఈరోజు (22 ఏప్రిల్) విడుదలయ్యాయి. 6.23 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవ్వగా…5,34,574 మంది అంటే 86.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 , బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 . 96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉంది. 62.47 శాతం ఉత్తీర్ణతతో కర్నూల్ జిల్లా చివరి స్థానంలో ఉంది.

Video Advertisement

ఆంధ్రప్రదేశ్ లో 2803 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డ్ సృష్టించాయి. 17 పాఠశాలల్లో మాత్రం ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వలేదు. ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ స్కూల్స్ ఉండడం ఆశ్చర్యకరం. ఈ ఫలితాల్లో 69.26 శాతం మంది ఫస్ట్‌ క్లాస్‌లో పాస్ కాగా, 11.87 శాతం సెకండ్‌ క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్ 23 నుండి రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇది ఇలా ఉంటె…పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి. మిగిలిన అన్ని సబ్జెక్టు లలో వందకి వంద మార్కులు వచ్చాయి. స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్న మనస్వికి తెలుగుఅడ్డ తరపున కంగ్రాట్యులేషన్స్.


End of Article

You may also like