సర్కారు వారి పాట సినిమా నెగిటివ్ టాక్ కి “అభిమానులే” కారణమా..? అలా చేయకపోయి ఉంటే..?

సర్కారు వారి పాట సినిమా నెగిటివ్ టాక్ కి “అభిమానులే” కారణమా..? అలా చేయకపోయి ఉంటే..?

by Sunku Sravan

Ads

మహేష్ బాబు మూవీ కోసం గత రెండు సంవత్సరాల నుంచి అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సర్కారు వారి పాట.

Video Advertisement

కానీ మూవీ అంచనాలకు తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకోలేదు అని చెప్పవచ్చు. అయితే సినిమా చూసిన కొంతమంది నెగిటివ్ రివ్యూ కావాలనే ఇస్తున్నారు. సినిమా ఫెయిల్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలా చేయడానికి ప్రధాన కారణం మహేష్ బాబు అభిమానులే అని చెప్పవచ్చు. అయితే సాధారణంగా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది.ఈ వార్ మెగా అభిమానులకు మరియు మహేష్ అభిమానులకు మధ్య చోటు చేసుకోవడం వల్ల సినిమాపై ప్రభావం పడింది. ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది మహేష్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం చేశారు. దాన్ని మనసులో పెట్టుకుని మెగా అభిమానులు ఊరుకుంటారా.. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు. దీంతో అభిమానుల మధ్య వచ్చిన వార్ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చిందని చెప్పవచ్చు. అయితే మహేష్ అభిమానులు సినిమా నెగిటివ్ రివ్యూ అనేది తప్పుడు ప్రచారం అని సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి తప్పుడు రివ్యూలు చూసి నమ్మకండి అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు.


End of Article

You may also like