YSR AAROGYASRI UPTO 25 LAKHS: ఆంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్…ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చు 25 లక్షలకు పెంపు…

YSR AAROGYASRI UPTO 25 LAKHS: ఆంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్…ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చు 25 లక్షలకు పెంపు…

by Mounika Singaluri

Ads

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో ఆరోగ్యశ్రీ ఒకటి. ఈ పథకం కింద పేదవారికి ఉచిత వైద్య అందిస్తున్నారు. అలాగే వైద్యం అనంతరం వారికి జీవన భృతి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.గతంలో 1059 ప్రొసీజర్స్ తో ఉన్న ఆరోగ్యశ్రీని… ఇప్పుడు 3257 ప్రొసీజర్స్ కి పెంచి బలోపేతం చేశారు. దేశంలో మొట్టమొదటిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ పేదవాడి వైద్యం కోసం ఏకంగా 25 లక్షల రూపాయల ఖర్చుతో ఉచిత వైద్యాన్ని అందించడానికి ముందుకు వచ్చింది.

Video Advertisement

ఈనెల 18వ తారీఖున సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను వివరించనున్నారు. ఈనెల 19వ తారీఖున రాష్ట్రంలోని 1.42 కోట్ల మందికి నూతన మార్గదర్శకాలతో రూపొందించిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తారు.

2019లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 37, 40, 525 మందికి ఉచిత వైద్యం అందించారు. దీనికోసం 11,859.96 కోట్లు ఖర్చు చేశారు. అలాగే వైద్యం అనంతరం  లబ్ధిదారులకు జీవన భృతి కోసం ఆసరా కల్పించే విధంగా వైయస్సార్ ఆరోగ్య ఆసరా కోసం ఇప్పటివరకు 1309 కోట్లు ఖర్చు చేశారు.


End of Article

You may also like