అరియానా గ్లోరీ యాంకర్ గా ఉంటూ వివాదాల దర్శకుడు వర్మని ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ సీజన్- 4 లోకి వెళ్లడం.. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకటిగా నిలవడం జరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.

Video Advertisement

ఈమె తాజాగా అనుభవించు రాజా చిత్రం లో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడవి నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. అసలు రాజ్ తరుణ్ అంటే నాకు నచ్చరు. టీవీలో కనిపించినా సరే ఛానల్ ని మార్చేస్తాను అని అందామె.

ఒకసారి ఆయన కారులో వెళ్తుంటే ఆ కారుకి యాక్సిడెంట్ జరిగి పోవాలని కోరుకున్నాను అని చెప్పింది. ఈ కోపానికి కారణం ఏమిటంటే బిగ్ బాస్ కి వెళ్లేముందు ఈమె రాజ్ తరుణ్ ని ఇంటర్వ్యూ చేసిందట. ఉదయం 9 గంటలకే ఇంటర్వ్యూ అని చెప్పింది. కానీ మధ్యాహ్నం రెండు అవుతున్న సరే రాజ్ తరుణ్ రాలేదు.

బయటికి వచ్చి చూస్తే కార్లో అతను వెళ్ళిపోయాడు. అదేంటి వెళ్ళిపోయారు అంటే డబ్బింగ్ కరెక్షన్ ఉంది సార్ కి అని చెప్పారట. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చిందట. అయితే ఈమె మొదటి సినిమా రాజ్ తరుణ్ తో చేయాల్సి వచ్చిందని షూటింగ్ మొదలైన రెండు రోజులకే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయానని అరియానా అంది.