ఫ్లాప్ సినిమా కోసం “ఒకే ఒక్కడు” సినిమాని రిజెక్ట్ చేసిన టాప్ హీరో ఎవరో తెలుసా?

ఫ్లాప్ సినిమా కోసం “ఒకే ఒక్కడు” సినిమాని రిజెక్ట్ చేసిన టాప్ హీరో ఎవరో తెలుసా?

by Mohana Priya

Ads

దర్శకుడు శంకర్ ని తెలుగువాళ్ళకి మరింత దగ్గర చేసిన సినిమాల్లో ఒకే ఒక్కడు సినిమా ఒకటి. ఒక మామూలు వ్యక్తి ఒక రోజు సీఎం అయితే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా విజయం సాధించింది ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడు సినిమా పేరు తమిళ్ లో ముదల్వన్.

Video Advertisement

తర్వాత అదే సినిమా నాయక్ పేరుతో హిందీలో కూడా రీమేక్ అయ్యింది. ఒరిజినల్ వెర్షన్ లో అర్జున్ చేసిన ఈ పాత్రని హిందీలో అనిల్ కపూర్ చేశారు. హీరోయిన్ గా రాణి ముఖర్జీ నటించారు. ఇక ఒరిజినల్ లో అర్జున్, మనీషా కొయిరాలా, రఘువరన్, వడివేలు వీళ్లందరి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మనం హీరోగా అర్జున్ ని తప్ప ఎవరిని ఊహించుకోలేం.

కానీ ఈ సినిమాకి మొదటి హీరోగా అనుకుంది అర్జున్ ని కాదట. ఐబి టైమ్స్ కథనం ప్రకారం ముందు ఈ కథను రజినీకాంత్ కి వినిపించారట శంకర్. కానీ రజనీకాంత్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. తర్వాత ఈ కథను విజయ్ కి వినిపించాడట. కానీ విజయ్ అప్పటికే కొన్ని సినిమాలు సైన్ చేసి ఉండటంతో కాల్ షీట్ అడ్జస్ట్ అవ్వక ఈ సినిమాని తిరస్కరించారట. తర్వాత అర్జున్ హీరోగా ఈ సినిమాలో నటించారు.

ఆ సమయంలో హీరో విజయ్ ఈ సినిమా వదులుకొని నటించిన ఇతర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి అంట. ఫ్లాప్ సినిమా కోసం ఒకే ఒక్కడు లాంటి మంచి సినిమా వదులుకున్నారు విజయ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. కానీ అర్జున్ ని తప్ప వేరే వాళ్ళని ఒకేఒక్కడు సినిమాలో హీరోగా ఊహించుకోలేము అనేట్టుగా నటించారు ఆ చిత్రంలో అర్జున్.

ఒకవేళ ఈ సినిమాకి సీక్వల్ ప్లాన్ చేస్తే హీరోగా రజనీకాంత్ ని కానీ కమల్ హాసన్ ని కానీ అనుకుంటున్నారట శంకర్. ఒకవేళ హీరో కొంచెం యంగ్ గా ఉండాలి అనుకుంటే విజయ్ నటిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని శంకర్ రోబో 2.0 ప్రమోషన్ సమయంలో, అలాగే ఒక చాట్ షో లో కూడా చెప్పారట.

 


End of Article

You may also like