Ads
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అలోక్ మౌర్య, జ్యోతిల సంఘటన మరవక ముందే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. అది కూడా ఎక్కడో కాదు ఉత్తరప్రదేశ్ లోనే జరగడం యాదృచ్ఛికం. గవర్నమెంట్ జాబ్ చేయడమే తన లక్ష్యం అని చెప్పిన భార్యకు భర్త కష్టపడి ప్రిపరేషన్ ఇప్పించడం వల్ల ఆమె సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ జాబ్ ను సాధించింది.
Video Advertisement
కానీ ఆ తర్వాత మరొకరితో రిలేషన్ పెట్టుకుని, తన మీద వరకట్న వేధింపుల కేసు పెట్టి, జైలుకు పంపించిందని అలోక్ మౌర్య చెప్పడం తెలిసిందే. ఇందులో వాస్తవాలు ఏవైనా తాజాగా అలాంటి ఘటనే మరోకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తరహ ఘటన యూపీలోని కాన్పూరులో చోటు చేసుకుంది. కాన్పూరులో నివసించే అర్జున్ సింగ్, సవిత మౌర్యలు భార్యాభర్తలు. ఈ జంటకి 2017లో పెళ్లి జరిగింది. భార్యకు చదువు పట్ల ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అర్జున్ సింగ్, సవిత మౌర్యను అప్పులు చేసి మరి నర్సింగ్ చదివించాడు.
నర్సింగ్ పూర్తి అయిన తరువాత సవిత మౌర్యకు మెడికల్ డిపార్ట్మెంట్ లోనే గవర్నమెంట్ కాంట్రాక్టు జాబ్ వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలల తరువాత సవిత మౌర్య ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఇక అప్పటి నుండి భర్త అర్జున్ సింగ్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమె మరో గదిలో నిద్రపోతుండడంతో అర్జున్ సింగ్ భార్యను నిలదీశాడు. దాంతో సవిత భర్తను నల్లగా, పొట్టిగా ఉన్నవంటూ, నీలాంటి భర్తతో ఉండలేనని చెప్పడంతో అర్జున్ షాక్ అయ్యాడు.
సవిత అర్జున్ సింగ్ నుండి విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. కానీ అర్జున్ సింగ్ మాత్రం తనకు భార్య సవిత కావాలని పోరాడుతున్నారు. భార్య చదువుకు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, అప్పును కూలీ పనులు చేసుకుంటూ తీరుస్తున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. తనకు న్యాయం కావాలని అర్జున్ సింగ్ వేడుకుంటున్నాడు.
Also Read: విచిత్ర పరిచయం, నలుగురు పిల్లలు, ఇల్లు అమ్మేసి మరి..? వీరి ప్రేమ కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!
End of Article