Ads
కాలం చేసే మాయ ఏంటో ఎవరికీ అర్ధం కాదు.జీవితం అంటేనే ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ,ఆశయాలు ఉంటాయి.ఎప్పటికైనా అనుకున్న ఆశయాలు నెరవేరాలని కలాలు కంటారు అందరు .కొంతమందికి అవి కోరికలుగానే మిగిలిపోతే మరికోంద్దరకి చిట్టచివరిదాకా నెరవేరినట్టు అనిపించి తుదిలో తప్పుకుపోతుంటాయి.చాలామంది చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎంతో కస్టపడి ఎప్పటికైనా స్క్రీన్ మీద దర్శకుడిగా తమ పేరు చూసుకోవాలి అని కలాలు కంటారు.ఇదే విధంగా ఒక నూతన దర్శకుడి జీవితంలో ఓ పెను విషాదం చోటు చేసుకుంది .వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ఈనాడు కధనం ప్రకారం ….భారతదేశ సంచలన దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసి” 4g ” అనే చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు అరుణ్ ప్రశాంత్ అనే వ్యక్తి.2016 నవంబర్ లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఈ చిత్రంలో కధానాయకుడిగా జివి ప్రకాష్ కుమార్ నటించాగా తిరకుమారన్ సంస్థ ఈ చిత్తాన్ని నిర్మించింది.కొన్ని కారణాల వలన ఈ చిత్ర షూటింగ్ మధ్యలో బ్రేక్స్ పడుతూ చివరగా రిలీజ్ అయ్యే సమయానికి ఈ చిత్ర దర్శకుడు మృతి చెందారు.దీంతో చిత్ర పరిశ్రమ అంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కొయ్యంబత్తుర్ మెట్టుపాళ్యం దగ్గరలో అరుణ్ బైక్ మీద వెళ్తుండగా లారీ గుద్దటంతో మొదటగా తీవ్ర రక్త స్రావం అయ్యి తర్వాత అక్కడికక్కడే మృతి చెందారు.దీనితో ఈ చిత్ర బృందమే కాకుండా కోలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.కాగా చిత్ర పరిశ్రమలో ప్రముఖులందరూ అరుణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు .
source: eenadu
End of Article