Ads
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జైలులో అరవింద్ ఎలాంటి ఆహారం తీసుకుంటారు అనే విషయం బయటకు వచ్చింది. ఇందులో రోజువారి ఆహార పదార్థాలు లిస్ట్ లాగా రాసి ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలని తీసుకుంటున్నారు. ఒక వారానికి సరిపడా మెనూ ఇందులో ఉంది. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి వేరువేరు ఆహారాలు సూచించారు. అల్పాహారానికి ఎక్కువగా పండ్లు మాత్రమే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అరటి పండ్లు, గుడ్లు, టీ, పల్లీలు, ఉప్మా, పోహ, ఇడ్లీ, కొబ్బరి చట్నీ, ఊతప్పం, వాటర్ బాటిల్స్ ఇవ్వాలి అన్నట్టు అల్పాహారం లిస్ట్ లో ఉంది.
Video Advertisement
మధ్యాహ్నం భోజనంలో అన్నంతో పాటు, రాజ్మా కూర, ఆలుగడ్డ, కాలీఫ్లవర్ తో వండిన కూర, పచ్చడి, అరటి పండ్లు, బెండకాయ కూర, పెరుగు, మామిడి పండు, సలాడ్, సొరకాయ కూర, బీన్స్ కూర, పాలకూర, మజ్జిగ పులుసు, పప్పు, ఉల్లిపాయలు, ప్రసాదం తో పాటు, ఉప్పు కూడా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం కొంత మోతాదుల్లో మాత్రమే అందించమని ఇందులో పేర్కొన్నారు. ఇంకా రాత్రి భోజనం విషయానికి వస్తే ఇందులో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలను ఇవ్వమని తెలిపారు.
సలాడ్, పెసరపప్పు, రోటి, పెరుగు, అరటి పండ్లు, పచ్చడి, పాలకూర, పప్పు, ఆలుగడ్డ కూర, బీన్స్ కూర, మిల్క్ పౌడర్, చోలే, ఉల్లిపాయలు, చామదుంపలతో చేసిన కూర, స్వీట్, పన్నీర్ కూర, మిక్స్డ్ వెజిటేబుల్ కూర, కాస్త అన్నం, లడ్డు, పండ్లు, బఠానీల కూర, క్యాబేజీ కూర, ఉప్పు, బెండకాయ వేపుడు కూడా ఇవ్వమని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. అన్నీ కూడా తక్కువ మోతాదులోనే తీసుకుంటారు. ఇదంతా ఒక టైం టేబుల్ లాగా తయారు చేసి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఏ సమయంలో ఎలాంటి ఆహారాలు అందించాలి అనేది వివరంగా పేర్కొన్నారు. ఎంత మోతాదులో ఇవ్వాలి అనే విషయాన్ని కూడా పేర్కొన్నారు. అందుకే అందులో ఇచ్చిన మోతాదులో మాత్రమే ఆహారాన్ని అందిస్తున్నారు.
End of Article