Ads
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కేవలం నటన మీదే దృష్టి పెట్టకుండా ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. చాలామంది తమకు నచ్చిన బిజినెస్ లను కొనసాగిస్తూ కూడా ఉంటారు.
Video Advertisement
ఎందుకంటే రేపు కెరీర్ ముగిసిపోయిన తర్వాత తమకి ఆ బిజినెస్ ఒక ఆధారంగా ఉంటుందని వారి ఆలోచన. తమిళ హీరో అరవింద్ స్వామి గురించి తెలుగులో పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించి అందరిని మెప్పించాడు.
అయితే అరవింద్ స్వామి తన కెరీర్ ప్రారంభంలో హీరోగా సినిమాలు చేశాడు. మణిరత్నం దళపతి సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత రోజా, బొంబాయి సినిమాలతో ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయాడు. అనంతరం బాలీవుడ్ లో కాజోల్ సరసన నటించిన మిన్సార కరవు చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నాడు.
అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న అరవింద్ స్వామి ఒక బిజినెస్ మెన్ అని ఎవరికి తెలియదు. ప్రస్తుతం అరవింద్ స్వామి వ్యాపార సామ్రాజ్యం వేల కోట్లు ఉంటుందని అంచనా. 2000 సంవత్సరం తర్వాత అతను సినిమాలు సరిగ్గా ఆడక పోవడంతో అతను తండ్రి వ్యాపారాలు చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. వీడి స్వామి అండ్ సన్స్ కంపెనీలో పనిచేస్తూనే ఇంటర్ ప్రో గ్లోబల్ లో పనిచేయడం పైన దృష్టి పెట్టాడు.
అయితే 2005 లో అతనికి కాలు పాక్షికంగా పక్షవాతానికి దారితీసింది. దాని నుండి కోరుకున్న తర్వాత పే రోల్ ప్రాసెసింగ్, తాత్కాలిక సిబ్బందిని నియమించే టాలెంట్ మ్యాగ్జిమస్ అనే సంస్థను స్థాపించాడు. అయితే 2022 సంవత్సరానికి టాలెంట్ మాక్సిమం కంపెనీ నికర ఆదాయం 3300 కోట్లుగా ఉంది. ప్రస్తుతం అరవింద్ స్వామి ఈ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే 2013లో తన గురువు మణిరత్నం కాదల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రామ్ చరణ్ ధ్రువ చిత్రం, కంగనా రనౌత్ తలైవి సినిమాలో కూడా నటించాడు
End of Article