Home Bigg Boss 5 telugu అతడు, ఆర్య, భద్రలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? ఇప్పుడు బిగ్ బాస్ 5 లో.?

అతడు, ఆర్య, భద్రలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? ఇప్పుడు బిగ్ బాస్ 5 లో.?

by Mohana Priya

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా మర్చిపోవడం చాలా కష్టం. టీవీ లో ఎన్ని సార్లు టెలికాస్ట్ చేసినా సరే మంచి టిఆర్పి రేటింగ్ వస్తుంది. అంత మ్యాజిక్ ఉంది ఆ సినిమాలో. ముఖ్యంగా ఆ డైలాగ్స్ అయితే ఇప్పటికి కూడా మనం సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. మణి శర్మ గారు అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

Athadu cinema child artist Deepak Saroj

deepak saroj in athadu

అయితే, ఈ సినిమాలో బ్రహ్మానందం గారి కొడుకు పాత్రలో నటించిన అబ్బాయి మన అందరికీ గుర్తుండే ఉంటాడు.  “నాన్న నా కోసం ట్రైన్ తెచ్చావా?” అంటే బ్రహ్మానందం గారు, “తీసుకొచ్చా. స్టేషన్ లో ఉంది. తెచ్చుకో పో” అనే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రలో నటించిన నటుడి పేరు దీపక్ సరోజ్. దీపక్ ఆర్య, లెజెండ్, పెద్దబాబు, ఆంధ్రుడు, భద్ర సినిమాల్లో కూడా నటించారు.Athadu cinema child artist Deepak Saroj

అంతే కాకుండా మిణుగురులు అనే సినిమాలో కూడా ఒక ముఖ్య  పాత్రలో నటించారు. ఈ సినిమా ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యింది. వందనం అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు దీపక్ సరోజ్. అయితే, దీపక్ సరోజ్ కి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటంటే, దీపక్ సరోజ్ బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నారట. ప్రస్తుతం అయితే ఈ సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ క్వారంటైన్ లో ఉన్నారు. మరి వారిలో దీపక్ సరోజ్ ఉన్నారా? లేదా? తెలుసుకోవాలంటే షో మొదలయ్యేంత వరకు ఆగాల్సిందే.

You may also like