MEGA 156: భారీ వర్కౌట్స్ చేస్తున్న హీరోయిన్.. చిరంజీవి సినిమా కోసమేనా? ఎవరంటే.?

MEGA 156: భారీ వర్కౌట్స్ చేస్తున్న హీరోయిన్.. చిరంజీవి సినిమా కోసమేనా? ఎవరంటే.?

by Harika

Ads

ఈ సంవత్సరం సంక్రాంతి సినిమాలు ఎంత పోటాపోటీగా విడుదల అయ్యాయో అందరికీ తెలిసిందే. వరుసగా నాలుగు తెలుగు సినిమాలు అందులోనూ పెద్ద హీరోలు సినిమాలు విడుదల కావడంతో జనాలు థియేటర్లకు తరలి వచ్చారు. ఈ కాంపిటీషన్లో నాగర్జున సినిమా కూడా ఒకటి. నాగార్జున హీరోగా నా సామి రంగ సినిమా తో ఈ సంక్రాంతికి వచ్చి మంచి హిట్ కొట్టాడు.ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లతో పాటు ఇందులో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ కి కూడా మంచి పేరు వచ్చింది.

Video Advertisement

నిజానికి సినిమా అంతటిలో ఆషికాకే ఎక్కువ అభినందనలు వచ్చాయి. నాగార్జున పక్కన సరిగ్గా సరిపోయింది ఈ ముద్దుగుమ్మ అంటూ మంచి కామెంట్లు వచ్చాయి. ఇంస్టాగ్రామ్ లో కూడా ఆషికకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది ఆషిక. ఆ సినిమా అనుకున్నంత రీతిలో ఆడక పోవడంతో ఆషిక కు అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ నా సామి రంగ సినిమాతో మాత్రం మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఆషిక.

ఇంత సున్నితమైన హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో తన జిమ్ వీడియోని పెట్టగా ఒకేసారి ప్రేక్షకులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సుకుమారంగా ఉంటుందనుకున్న అమ్మాయి ఇంత రఫ్ అండ్ ఆఫ్ గా జిమ్ చేస్తుంది ఏంటి అని షాక్ అయ్యారు. చాలా తేలికగా ఎంతో కష్టమైనా వర్కౌట్స్ ని కూడా సింపుల్ గా చేసేస్తుంది ఈ భామ. ఇంత కష్టపడి జిమ్ వర్క్ అవుట్ లు చేస్తుందంటే కొత్త సినిమా ఆఫర్ ఏదో వచ్చినట్టుంది అని కొంతమంది అభిమానులు అంటున్నారు.

మరికొన్నిమంది మాత్రం చిరంజీవి రానున్న చిత్రం విశ్వంభరలో ఈమె ని హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసమే నేమో ఇంత వర్క్ అవుట్ చేస్తోంది అని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ చిరంజీవి సినిమా అవకాశం ఆషికాకి వచ్చినట్టయితే ఈమె అందానికి, నటనకి ఈ భామ దశ తిరిగిపోతుంది. హిట్లర్ సినిమాలో లాగా చెల్లెలి పాత్రలో ఆషిక అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాలి.

 


End of Article

You may also like