Ads
మనం ప్రేమ గురించి మామూలుగా ఎన్నో మాటలు వింటూనే ఉంటాం. ఎంతో మంది ప్రేమికులు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎదుర్కొని తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. ప్రేమకి కులం, మతం, ప్రాంతం ఇలాంటివేమీ భేదాలు కావు అని అంటుంటారు. ఇద్దరు వ్యక్తులు వారిని ఒకరినొకరు ఇష్టపడటం మాత్రమే ముఖ్యం అని అంటారు.
Video Advertisement
ఇలాంటి ఒక సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక కోచింగ్ సెంటర్ లో టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అశోక్ కుమార్ అంధులు అయినా కూడా అన్నిట్లో ముందు ఉండేవారు. అశోక్ కుమార్ తెలివితేటలను చూసి అందరూ అభినందించేవారు.
తొట్టంబేడు మండలం లోని ఎస్టీ వర్గానికి చెందిన వీరమ్మ అనే యువతి కూడా అదే కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు వీరమ్మ అశోక్ ని ఇష్టపడ్డారు. అశోక్ ప్రతిభను ఎన్నో సార్లు మెచ్చుకున్నారు వీరమ్మ. అశోక్ తో తనని ప్రేమిస్తున్నాను అని, పెళ్లి చేసుకుందామని చెప్పారు. అందుకు అశోక్ మొదట వద్దు అని చెప్పారు.
కానీ తర్వాత వీరమ్మ ప్రేమని అర్థం చేసుకున్నారు. అశోక్, వీరమ్మ కులాలు వేరైనా కూడా కలిసి పెద్దలను ఒప్పించారు. వీరమ్మ తల్లి తండ్రులు మొదట ఒప్పుకోలేదు. కానీ చివరికి వారి పట్టుదలను చూసి ఒప్పుకున్నారు. నగరిలో బుధవారం శిరిడీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీరి పెళ్లి జరిగింది. పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నందుకు వీరిని అందరూ ప్రశంసించి అలాగే వీరిద్దరికీ అభినందనలు అందించారు.
End of Article