బిగ్ బాస్ తో టెలివిజన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, ఆ తర్వాత కామెడీ స్టార్స్ ప్రోగ్రాం తో అలరిస్తున్న నటి అషు రెడ్డి. అయితే అషు రెడ్డి కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో తీసింది మరెవరో కాదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .

ashu reddy

 

ఈ ఫోటోని స్వయంగా స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ఫోటో షేర్ చేసి ఈ విధంగా రాశారు. “ఆమె అషు రెడ్డి యేనా.? ఈ ఫోటో ఎవరు తీశారో తెలిస్తే వాళ్లు నన్ను సంప్రదించగలరా?” అని పోస్ట్ చేశారు. అంతకు ముందు అరియానా గ్లోరీ తో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు అదే ఈ విధంగా ఒక ఇంటర్వ్యూ అషు రెడ్డి తో చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.