“నిజనిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు..!” అని… ఫైర్ అవుతున్న అషు రెడ్డి..! ఏం అన్నారంటే..?

“నిజనిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు..!” అని… ఫైర్ అవుతున్న అషు రెడ్డి..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

గత కొద్ది కాలంగా టాలీవుడ్ లో డ్రగ్ కేసు విషయం వైరల్ గా మారింది. టాలీవుడ్ నిర్మాత అయినటువంటి కె.పి.చౌద‌రి ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్తలు ఏదో ఒక రూపంలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ కె.పి.చౌద‌రి తో పరిచయం ఉన్నటువంటి సినీ మరియు రాజకీయ ప్రముఖులు కొందరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.

Video Advertisement

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన అషు రెడ్డితో పాటు సురేఖా వాణి, జ్యోతి లాంటి పేర్లు ఈ కేసు విషయంలో వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా కె.పి.చౌద‌రితో మీరు తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా కొన్ని చానల్స్ లేనిపోని ఊహాగానాలను వీటికి జత చేసి మరి న్యూస్ రిపోర్ట్స్ రాస్తున్నాయి. అయితే ఇటు వీరు కూడా తమకు ఈ కేస్ కి ఎటువంటి సంబంధం లేదు అన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయినా సరే కొన్ని చానల్స్ ఇంకా విషయాన్నీ వదలకుండా రిమాండ్ రిపోర్టును బయటపెట్టి అందులో అషురెడ్డి నెంబర్ ఉంది అని చెబుతున్నాయి. అయితే డ్రగ్స్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే వీడియో విడుదల చేసిన తనని వెంటాడడంతో అషు రెడ్డి తాజాకా మరొక వీడియోని కూడా రిలీజ్ చేశారు. తన పర్సనల్ నెంబర్ను చానల్స్ ఇలా ఓపెన్ గా చూపించడం వల్ల…తనకు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు.

గత రెండు రోజులుగా నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో,నా చుట్టూ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అందరికీ తెలుసు. అయినా సరే కొన్ని చానల్స్ పనిగట్టుకొని మరి ఈ డ్రగ్స్ కేస్ విషయంలో నా నెంబర్ ను ఓపెన్ గా చూపించి నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. సదరు కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఎంత చెప్పినా వీరు పట్టించుకోవడం లేదు.

అసలు విషయం తెలుసుకోకుండా , నిజా నిజాలతో సంబంధం లేకుండా ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడే చానల్స్ పై పరువు నష్టం దావా వేస్తాను. ఇలా నా నెంబర్ ఓపెన్ గా చూపించడం వల్ల ప్రతి సెకండ్ కి ఒక కాల్ రావడంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఈ ఇష్యూ జరిగినప్పుడు నేను ఇండియాలో లేను.. నాకు ఈ కేస్ కి ఎటువంటి సంబంధం లేదు.. అని అన్నారు.


End of Article

You may also like