అదృష్టం అంటే ఈ అమ్మాయిదే అనుకుంటా.? గుడిసెలో నుండి…కోటీశ్వరుడి గుండెల్లోకి.!

అదృష్టం అంటే ఈ అమ్మాయిదే అనుకుంటా.? గుడిసెలో నుండి…కోటీశ్వరుడి గుండెల్లోకి.!

by Megha Varna

Ads

ఒక పేదింటి అమ్మాయి డబ్బున్న అబ్బాయిని ఇష్టపడడంతో ఆమె తలరాత మారిపోయింది. మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. అబ్దుల్ అనే ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు పూరిగుడిసెలో ఉండేవాడు. వాళ్ళు పేదరికంతో జీవించేవారు. ఒక్కొక్కసారి పూట గడవడం కూడా ఎంతో కష్టం అయిపోయేది.

Video Advertisement

కుటుంబంతో పాటు ఒక మురికివాడ లో చిన్న గుడిసెలో ఉంటున్నాడు అబ్దుల్. అయితే అబ్దుల్ పెద్ద కూతురికి మంచి మనసు ఉంది. ఈమె చాలా అందంగా కూడా ఉంటుంది. ఈమె పేరు షాహిమా.

ఈమెకి దైవభక్తి ఎక్కువ. నిత్యం అల్లాను పూజిస్తూ ఉండేది. ఈ మురికివాడ కి దగ్గరలో ఒక టౌన్ ఉంది. అక్కడ ఆసిఫ్ అనే ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. చిన్న వయసులోనే పూర్వీకుల నుండి వస్తున్న వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. వీళ్ల కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. ఆసిఫ్ నాయనమ్మ ఇల్లు షాహిమ మురికి వాడికి దగ్గర్లోనే. ఒకరోజు ఆసిఫ్ తన తల్లిని తీసుకొని నాయనమ్మ ఇంటికి వెళ్ళాడు.

అయితే ఈ క్రమంలో ఆసిఫ్ తల్లి షాహిమని చూస్తుంది. షాహిమా వాళ్ళ గుడిసె బయట నమాజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి లో తన ఇంటి కోడలుకి కావాల్సిన లక్షణాలు ఉన్నట్లు ఆమె గమనించి.. మొత్తానికి కోడలు చేసుకోవాలని అనుకుంటుంది. పైగా ఆసిఫ్ కూడా తన తల్లి చెప్పడంతో ఆమెలో ఏదో ప్రత్యేకత ఉందని తెలుసుకుంటాడు.

తనకి కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టం అని తన తల్లితో చెప్తాడు. ఆ తరవాత షాహిమ ఇంటికి వెళ్లి మాట్లాడేసరికి వాళ్ళ తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఇంత పెద్ద సంబంధం వచ్చినందుకు భయపడతారు. మంచి లక్షణాలు ఉన్న కోడలు వస్తే చాలు మాకు అని అసిఫ్ తల్లి చెప్తారు. రెండు కుటుంబాలు కూడా సరేనని ముహూర్తాన్ని పెట్టుకుంటారు. సరిగ్గా తిండి కూడా లేని కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు.


End of Article

You may also like