ఆర్డర్ చేసిన దాంట్లో స్నాక్స్ రాలేదని ఫోన్ చేసాడు… రూ. 2.25 లక్షలు హుష్కాకి! అసలేమైంది?

ఆర్డర్ చేసిన దాంట్లో స్నాక్స్ రాలేదని ఫోన్ చేసాడు… రూ. 2.25 లక్షలు హుష్కాకి! అసలేమైంది?

by Megha Varna

Ads

మే ఒకటవ తారీఖున ముంబైలోని వ్యారవేత్త కిరణ్ సరుకులు ఇంటికి డోర్ డెలివరీ తెప్పించుకునేందుకు ఇంటర్ నెట్లో  సెర్చ్ చేసాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ద్వారా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలతో పాటు 400 రూపాయలు విలువైన చిరుతిళ్ళను కూడా ఆర్డర్ చేసాడు.సరుకులు ఇంటికి చేరినా ఎందువలనో చిరుతిళ్ళు మాత్రం రాలేదు …దీంతో తాను ఆర్డర్ చేసిన వెబ్ సైట్ హెల్ప్ లైన్ నెంబర్ కోసం నెట్లో శోదించాడు .ఆ సమయంలో ఒక సైబర్ నేరగాడు ఒక నకిలీ నెంబర్ ను వెబ్ సైట్లో అప్లోడ్ చేసి ఉంచాడు.ఆ నెంబర్ కు ఈ వ్యాపారవేత్త కాల్ చేసాడు .అప్పుడు ఆ సైబర్ నేరగాడు అడిగిన బ్యాంకు అకౌంట్ నెంబర్ , ఏటిఎం కార్డు నెంబర్ , మూడు అంకెల సివివి ను ఆ వ్యాపారవేత్త చెప్పేసాడు ..

Video Advertisement

representative image

ఆ తర్వాత ఆ మోసగాడు ,వ్యాపారవేత్త మొబైల్ ఫోన్ కు ఒక లింక్ పంపించి మరొక మొబైల్ నెంబర్ కు ఫార్వర్డ్ చెయ్యమని అడిగాడు .అదే విధంగా చేసాడు ఆ వ్యాపారవేత్త .ఆ తర్వాత మోసగాడు తన యూపీఐ పిన్ ను పాస్ చెయ్యమని అడిగాడు మరియు తరువాత తన మొబైల్ నెంబర్ లో ఓటీపీ ఇవ్వమని కోరగా అదే విదంగా ఆ వ్యాపారవేత్త చెయ్యడంతో నాలుగు లావాదేవీలలో రెండు గంటల్లో మొత్తం 2.25 లక్షలు తస్కరించాడు.

తన డబ్బులు అకౌంట్ ద్వారా సైబర్ నేరగాడు దొంగిలించాడు అని తెలుసుకున్న వ్యాపారవేత్త పోలీసులకు పిర్యాదు చేసాడు .దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెయ్యడం మొదలుపెట్టారు పోలీసులు .అసలు ఆ సైబర్ నేరం ఎలా జరిగిందో అనే విషయాన్ని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ రితేష్ భాటియా వివరిస్తూ…సివివి ,యూపీఐ పిన్ మరియు ఓటీపీతో సహా అన్ని సెక్యూరిటీ కలిగిన బ్యాంకు వివరాలను ఈ బాధితుడు ద్వారా నేరగాడు తెలుసుకున్నాడు . తద్వారా తన కంప్యూటర్లో మరో యూపీఐ ఖాతాను ఏర్పాటు చెయ్యడానికి నేరగాడికి అవకాశం దొరికింది .ఆ మోసగాడి దగ్గర ఎటిఎం కార్డు వివరాలు కూడా ఉన్నాయి .అందుకే ఇంత పెద్ద మొత్తాన్ని క్షణాలలో దొంగిలించడానికి వీలు కుదిరింది. అయినా ప్రజలు ఇప్పటికి తమ ఓటీపీ లు మరియు సివివి నెంబర్ లు ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అన్నారు..


End of Article

You may also like