Ads
ప్రజలు మామూలుగా చెబితే వినట్లేదని అర్థం చేసుకున్న పోలీసులు ఈమధ్య క్రియేటివ్ గా ఆలోచిస్తూ ప్రజలలో అవగాహన పెంచే చర్యలు చేపడుతున్నారు.తాజాగా ప్రజలలో కరోనా పై అవగాహన పెంచేందుకు పోలీసులు చేసిన ఓ ప్రయత్నం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.
Video Advertisement
ఇక వివరాలలోకి వెళదాం.ప్రభాస్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసింది.అది ప్రస్తుతం సోషల్ మీడియా అంత వైరల్ అవుతుంది.
బాహుబలితో దేశమంతా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ చిత్రం తాజా పోస్టర్ ను ప్రజలలో అవగాహన కల్పించడం కోసం పోలీసులు ఫొటోషాప్ చేసి అందులో ఉన్న హీరో,హీరోయిన్ కు మాస్క్ లు పెట్టారు. కోవిడ్ సందర్భంగా మీరు ప్రేమించేవారిని మాస్క్ పెట్టుకోమని చెప్పండి.ఇదే విషయాన్ని ప్రభాస్ కు చెప్పడానికి మేము ప్రయత్నించాం.కాని అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.అందుకే ఈ మెసేజ్ ను ఫొటోషాప్ ద్వారా పంపిస్తున్నాం అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అస్సాం పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది.ఆ వైరల్ అవుతున్న ట్వీట్ పై ఓసారి లుక్ వేయండి.
Ask your loved ones to put Mask whenever they are out.
We tried calling Prabhas but failed.
Now sending the message through photoshop.@TSeries @UV_Creations @hegdepooja @director_radhaa @assampolice#RadheShyam #Prabhas20 pic.twitter.com/WNyOSzklVC— Nagaon Police (@nagaonpolice) July 10, 2020
End of Article