Ads
సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలు ఎంతో మంది ఈ సంవత్సరం వివాహం చేసుకున్నారు. నిఖిల్, నితిన్, రానా, కాజల్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నిహారిక కొణిదెల కూడా చేరబోతున్నారు. ఆగస్టులో నిహారికకి, చైతన్య జొన్నలగడ్డతో ఎంగేజ్మెంట్ అయింది.
Video Advertisement
చైతన్య తండ్రి ప్రభాకర్ రావు గుంటూరు రేంజ్ ఐజీ. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన చైతన్య జూబ్లీహిల్స్ లో ఉన్న భారతీయ విద్యా భవన్ లో చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. హైదరాబాద్ కి చెందిన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు చైతన్య.
డిసెంబర్ 9 వ తేదీన ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్య వివాహం జరగనుంది. ఈ వేడుక ఐదు రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. వరుణ్ తేజ్ ఈ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పెళ్ళి జరగబోతోంది. పెళ్లికి కేవలం కొంత మంది అతిథులు మాత్రమే రాబోతున్నారు.
పెళ్లి కొడుకుకి లాంఛనాల కింద నాగబాబు పెద్ద మొత్తాన్ని ఇస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, డైరెక్ట్ గా అల్లుడికి కాకుండా, నిహారికకి దాదాపు 10 కోట్ల మొత్తాన్ని లాంఛనంగా ఇవ్వబోతున్నారు.అంతే కాకుండా పెళ్లికి నగలు, అవన్నీ కలిపితే దాదాపు 2 కోట్లు ఉంటాయి. ఇవే కాకుండా నిహారిక పేరు మీద ఉన్న ఒక బంగ్లాని నాగబాబు తన అల్లుడికి ఇవ్వబోతున్నట్లు సమాచారం.
End of Article