Home Filmy Adda Anushka Shetty : అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి చెప్పేసిన జ్యోతిష్కుడు.!

Anushka Shetty : అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి చెప్పేసిన జ్యోతిష్కుడు.!

by Mohana Priya

ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అనుష్క శెట్టి. ఒకరకంగా చాలా సంవత్సరాల తర్వాత అరుంధతి సినిమాతో మళ్లీ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇదే తరహాలో ఎన్నో పవర్ ఫుల్ పాత్రలు చేశారు అనుష్క. అనుష్క చివరిగా 2020 లో వచ్చిన నిశ్శబ్దం సినిమాలో నటించారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అనుష్క ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

anushka

అనుష్క పెళ్లి గురించి పండిట్ జగన్నాథ్ గురూజీ  ఒక వార్తను చెప్పారు. అనుష్క చాలా మంచి వ్యక్తి అని, ఆమెలో ఎటువంటి అహంకారం ఉండదు అని ఆయన చెప్పారు. అనుష్క ఎమోషన్స్ కి చాలా వాల్యూ ఇస్తారని, అలాగే తన కెరియర్, పని గురించి మాత్రం ఎక్కువగా ఆలోచిస్తారు అని చెప్పారు. అనుష్క పెళ్లి గురించి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ బయట వ్యక్తిని అనుష్క వివాహం చేసుకుంటారు అని చెప్పారు. వచ్చే సంవత్సరంలో కానీ, 2023 లో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఆ జ్యోతిష్కుడు అన్నారు. కానీ అనుష్క అభిమానులు మాత్రం మళ్లీ స్వీటీని పెద్ద తెరపై ఎప్పుడు చూస్తామని ఎదురుచూస్తున్నారు.

You may also like