“విజయ్ దేవరకొండ” కెరీర్ ముగిసినట్టేనా..? జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే..?

“విజయ్ దేవరకొండ” కెరీర్ ముగిసినట్టేనా..? జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే..?

by Megha Varna

Ads

ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా హిట్ అవ్వలేదు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు పెట్టుకున్నా డిసప్పాయింట్ చేసింది. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇలా విజయ్ దేవరకొండ కి కాలం కలిసి రావడం లేదు.

Video Advertisement

భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఊహించిన ఫలితాలు ఈ సినిమాకి అందలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఖుషి సినిమా షూటింగ్ కూడా అవుతోంది. ఇంచుమించు చాలా షూటింగ్ అయిపోయింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తున్నారు. అయితే సమంతకు కొన్ని సమస్యలు రావడం వల్ల షూటింగ్ మధ్యలో ఆగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే కేవలం సినిమాల టాపిక్ మాత్రమే కాకుండా యూట్యూబ్ లో జ్యోతిష్యులు కూడా విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావన చేస్తున్నారు. కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో కాకుండా యూట్యూబ్ లో కూడా జ్యోతిష్యులు విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు ఏమైంది అనేది చూస్తే.. విజయ్ దేవరకొండ కి అష్ట శని దశ వలన కెరీర్ లో సమస్యలు వస్తున్నాయని మళ్లీ మళ్లీ డిజాస్టర్ లు వస్తున్నాయి అని అంటున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా హిట్ కాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా హిట్ కాలేదు. అలానే రీసెంట్ గా వచ్చిన లైజర్ పరిస్థితి కూడా అదే. ఇలా ఏవి కూడా హిట్ అవ్వలేదు. మరో జ్యోతిష్యుడు అయితే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వలన.. అనవసరమైన స్టేట్మెంట్స్ వలన కాంట్రవర్సయిలను, ఫెయిల్యూర్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

దీని అర్థం విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తం పూర్తయినట్లు కాదని మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.  లైగర్ ఫెయిల్ అవ్వడం విజయ్ దేవరకొండ పై గట్టి ప్రభావం పడింది కానీ ఇక్కడితో కెరీర్ ముగిసిపోలేదు. విజయ్ దేవరకొండ సినిమాలు సక్సెస్ అవ్వాలంటే కాస్త ప్లాన్ చేసుకుని తీస్తే సరిపోతుంది.


End of Article

You may also like