“అతడు” లో మీరు చూడని 6 సన్నివేశాలు ఇవే…ఎందుకు డిలీట్ చేసారో?

“అతడు” లో మీరు చూడని 6 సన్నివేశాలు ఇవే…ఎందుకు డిలీట్ చేసారో?

by Mohana Priya

Ads

సినిమాకి సంబంధించిన క్రాఫ్ట్స్ లో ఎడిటింగ్ ఒకటి. ఎడిటింగ్ లో అవసరం లేని సీన్స్ తీసేస్తారు. సినిమా రన్ టైం అనేది ఎడిటింగ్ పైన ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా సినిమా సాగిపోవాలి అంటే మంచి ఎడిటింగ్ కచ్చితంగా అవసరం. దర్శకుడు మనకి చూపించాలి అనుకున్న పాయింట్ ని స్క్రీన్ పై స్ట్రైట్ గా ప్రెజెంట్ చేయడానికి ఎడిటింగ్ సహాయపడుతుంది.

Video Advertisement

ప్రతి సినిమాకి ఎడిటింగ్ జరుగుతుంది. ప్రతి సినిమాలోనూ కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో తొలగించబడతాయి. అందులో కొన్ని అవసరం లేని సన్నివేశాలు అయ్యుండొచ్చు. కొన్ని అవసరం ఉన్నా కూడా సినిమా నిడివి పెరగడం వల్ల తొలగించాల్సి వచ్చి ఉండొచ్చు. లేదా ఇంకేదైనా కారణం కూడా కావచ్చు. అలా చాలా సినిమాలో డిలీట్ చేసిన సన్నివేశాలను యూట్యూబ్ లో డిలీటెడ్ సీన్స్ అని విడుదల చేస్తారు.

అతడు సినిమా గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు సినిమాలో కూడా ఇలాగే కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో తొలగించబడ్డాయి. ప్రస్తుతం మనం అతడు సినిమాలో ఎక్కడా చూడని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రిన్స్ మహేష్ డాట్ కాం వాళ్లు విడుదల చేసిన అతడు డిలీటెడ్ సీన్స్ లోని అన్ సీన్ ఫోటోలు ఇవే.

#1

ఇది అతడు లో బాసర్లపూడి లో షూటింగ్ సమయంలో తీసిన ఫోటో.

#2

ఇది అతడు లోని డిలీటెడ్ సీన్ లోది. ఈ సీన్ లో త్రిష గెటప్ డిఫరెంట్ గా ఉంది.

#3

ఇది అతడు సినిమాలోని ఇంకొక డిలీటెడ్ సీన్ ఫోటో. ఫోటోని బట్టి చూస్తే మహేష్ బాబు కి, త్రిష కి మధ్య కాన్వర్జేషన్ జరుగుతున్నట్టు ఉంది.

#4

ఇది మరొక డిలీటెడ్ సీన్ లోని స్టిల్.

#5

రెండో ఫోటో, మూడో ఫోటో ఇంకా ఈ ఫోటో లో మహేష్ బాబు డ్రెస్ ఒకే లాగా అనిపిస్తోంది. మూడవ ఫోటోలో లైటింగ్ పడి కలర్ మారింది కానీ సరిగ్గా గమనిస్తే మహేష్ బాబు వేసుకున్న డ్రెస్ సేమ్ అని మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు. బహుశా ఇదంతా ఒకే డిలీటెడ్ సీన్ అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు కూడా.

#6

ఇది సినిమా స్టార్టింగ్ లో ఒక మార్కెట్ లో మహేష్ బాబు ఇంకా సోనూసూద్ కలిసి ఒకతన్ని కత్తితో పొడిచి పారిపోతున్నప్పుడు జరిగే ఫైట్ లో ఎడిట్ చేసిన సన్నివేశం అయ్యుండొచ్చు. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ చూస్తే కొంచెం అలాగే ఉంది.


End of Article

You may also like