తల్లితండ్రులు అతనితో ఫోన్ లో మాట్లాడద్దు అన్నందుకు..ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

తల్లితండ్రులు అతనితో ఫోన్ లో మాట్లాడద్దు అన్నందుకు..ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

by Megha Varna

Ads

ఒకే ఒక జీవితం ..జీవితం చాలా విలువైనది ..అందులోనే యువత జీవితం చాలా ముఖ్యమైనది.ఎన్నో ఆశలతో ఆశయాలతో ముందుకు వెళ్తూ కన్న తల్లితండ్రులను బాగా చూసుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంటుంది .కాగా కొత్తగా చేటుచేసుకున్న మార్పులలో మొబైల్ అనేది చిన్న పిల్లల నుండి పెద్ద వారిదాకా అందరి జీవితాలలో ఒక భాగం అయిపోయింది.

Video Advertisement

 

 

అసలు మొబైల్ చేతిలో లేనిదే తోచదు అనేంత బానిసలు  అయిపోయారు.దీంతో చాలామంది మానసికంగా చాలా బలహీనంగా ఉంటున్నారు.ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా మనోధైర్యంతో వాటిని అధిగమించి ముందుకు పోవాల్సిన మెంటల్ స్ట్రెంగ్త్ ను పెంచుకోలేక, చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడి జీవితాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు ..కాగా ఇంట్లో వాళ్ళు ఫోన్ మాట్లాడద్దు అని అన్నారని ఓ యువతి  ఆత్మహత్య కు పాల్పడింది.దీంతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి ..వివరాల్లోకి వెళ్తే

 

సాక్షి కధనం ప్రకారం …బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండలంలోని జూకల్‌లో చోటు చేసు కుంది. ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గైని మీనా(17) ఇంట ర్‌ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. రెండేళ్లు సంజీవన్‌రావుపేట్‌కు చెందిన బేగరి శ్రీకాంత్‌తో పరి చయం ఏర్పడింది. తరచుగా అతనితో ఫోన్‌లో మాట్లాడుతూ చాటింగ్‌ చేస్తోంది. రెండు నెలల క్రితం శ్రీకాంత్‌ జూకల్‌లో మీనా ఇంటికి రావడంతో కుటుంబీకులు రావద్దని పంపించి వేశా రు. మంగళవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా మీనా ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి గైని బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు..

ఈ ఘటనపై అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి .చదువుకునే విద్యార్థులకి ఎప్పుడు మార్క్ లు ,ర్యాంకులు గురించి తప్ప జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలని అధిగమించే మనోధైర్యం నేర్పలేకపోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .తప్పు ఎవరిది  ఐన కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోని ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం సరైనది కాదు అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ..

source: sakshi


End of Article

You may also like