Ads
బిగ్ బాస్ తెలుగు సీజన్-6 మూడు వారాలు పూర్తి చేసుకుంది. మూడవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇవాళ జరుగుతుంది. నామినేషన్ లో ఇంట్లో ఉన్న కొంత మంది తప్ప దాదాపు అందరూ నామినేట్ అయ్యారు. నామినేషన్ చాలా సీరియస్ గా నడిచింది. ఈ వారం టాస్క్ కూడా అలాగే ఉంది. ఇవాళ నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడుతారు.
Video Advertisement
ప్రోమో కూడా విడుదల అయ్యింది. అయితే ఇవాళ ఎపిసోడ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఓటింగ్ ప్రక్రియలో చూసుకుంటే అందరి కంటే ఎక్కువ ఓట్స్ రేవంత్ కి వచ్చాయి. ఆ తర్వాత శ్రీహాన్ కి వచ్చాయి. ఆ తర్వాత చలాకి చంటి, బాలాదిత్య, గీతూకి కూడా మంచి ఓట్లు వచ్చాయి. వీరితో పాటు నేహా, ఆరోహి, వాసంతి, ఇనయ సుల్తానా కూడా నామినేట్ అయ్యారు.
అయితే వీరి నలుగురిలో ఇనయ సుల్తానాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఈ వారం ఇనయ సుల్తానా ఎలిమినేట్ అవుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఎందుకంటే మిగిలిన ముగ్గురితో పోలిస్తే ఇనయ టాస్క్ బాగా ఆడుతున్నారు. ఈ వారం ఇంకా బాగా ఆడారు. నేహా మాట్లాడడం తప్ప ఎక్కువగా ఆడటం లేదు అని అంటున్నారు.
అలాగే వాసంతి కూడా గ్లామర్ కోసం మాత్రమే కానీ ఆటలో పెద్దగా కనిపించరు అని అంటున్నారు. అలాగే ఆరోహి కూడా అప్పుడప్పుడు మాత్రమే టాస్క్ లో కనిపిస్తున్నారు. కానీ వాసంతి, నేహాతో పోలిస్తే బానే ఆడుతున్నారు అని అనిపిస్తున్నారు. దాంతో వారిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కానీ ఇలా చేయడం సరైన నిర్ణయం కాదు ఏమో, ఒకవేళ ఇదే జరిగేది ఉంటే మేము ఓట్స్ వేసి వాళ్లని సేవ్ చేయాలి అని అంత కష్ట పడటం ఎందుకు అని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్స్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.
End of Article