Ads
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం క్రీడలకు పాకిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్లోజ్ స్టేడియం లో ఆడియన్స్ లేకుండా మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
Video Advertisement
ఈ నేపథ్యంలో టాస్ వేసిన తర్వాత ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్,కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అయితే వెంటనే ఫించ్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు.ఈ ఘటనతో ఇద్దరు నవ్వుకున్నారు. ర్వాత కేన్ విలియమ్సన్, ఫించ్‌లు తమ మోచేతులతో ట్యాప్ చేసుకున్నారు. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడానికి భయపడుతున్నారంటే కరోనా వైరస్ ఎంతలా ప్రభావం చూపిస్తుందో తెలుస్తూనే ఉంది.
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 71 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు వార్నర్ (67), ఫించ్ (60), లబుషేన్ (56) రాణించారు. కరోనా భయంతో ఖాళీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 258 రన్స్ చేసింది. సోధికి 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత కివీస్ 41 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గప్టిల్ (40), లాథమ్ (38) మాత్రమే రాణించారు. కమిన్స్, మార్ష్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.
ఈ మ్యాచ్ లో మరొక ఆసక్తికర ఘటన కూడా చోటుచేసుకుంది. గల్లీ క్రికెట్ లో లాగా బాల్ గ్రౌండ్ దాటి స్టాండ్స్ లో పడితే. ఆటగాళ్లే వెళ్లి బాల్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆడియన్స్ ఉండి ఉంటె వారు బాల్ అందించేవారు. కానీ ప్రేక్షకులు లేక బాల్ కోసం ఆటగాళ్లే వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ వీడియో మీరే చూడండి.
watch video:
Like a needle in a haystack#AUSvNZ pic.twitter.com/T6A29tKaYj
— cricket.com.au (@cricketcomau) March 13, 2020
అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసీస్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌కు కరోనా సోకిందని అనుమానం రావడంతో మ్యాచ్ నుంచి తొలగించారు. తర్వాత ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్‌సన్ కోవిడ్-19 టెస్టులో నెగెటివ్ రావడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. నివేదికలో నెగెటివ్ ఫలితం రావడంతో హోటల్ గది నుంచి జట్టుతో కలిసేందుకు సిడ్నీ మైదానానికి వెళ్లాడు. కాగా ఆసీస్- న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో ఇరు జట్ల మధ్య జరగనున్న సిరీస్‌లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరగడం విశేషం.
End of Article