ఇటీవల జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా చతికిలపడిన సంగతి మనందరికీ తెలుసు. అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు నమోదు చేశారు. అయినాసరే ఐపీఎల్ లో మాత్రం ఎప్పుడు నిరాశగానే ఉంటుంది. ఇప్పటివరకు ఒక్క సారి కూడా బెంగళూరు జట్టు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కప్ గెలవలేదు. ప్రదర్శన పేలవంగా ఉండడంతో తొలగించబడిన ఒక ప్లేయర్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ కే బాస్ గా ఉన్నారు.

ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ 2000 -01 సంవత్సరంలో యాషెస్ పర్యటనకు ఎంపిక అయ్యి నాలుగో టెస్టులో గాయపడిన స్టీవ్ వా స్థానంలో ఆడారు. ఇందులో కేవలం 15 పరుగులు చేశారు. ఆ తర్వాత జట్టులో స్థానం కోసం ఏడు సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అంతలోనే మళ్లీ జింబాబ్వేపై అవకాశం వచ్చింది. సిడ్నీలో జరిగిన ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో  అద్భుతంగా రాణించారు. 65 పరుగులకే 6 వికెట్లు తీసుకున్నారు. మరుసటి సంవత్సరం సిడ్నీలో మ్యాచ్ ఆడి భారతదేశంపై మొదటి టెస్ట్ సెంచరీ కూడా చేశారు.Australian cricketer who elected as head coach for RCB

2011 సంవత్సరంలో యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇందులో సైమన్ ని జట్టు నుంచి తొలగించారు. క్రికెట్ ఆస్ట్రేలియా తర్వాతి సీజన్ కోసం ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. తర్వాత చాలా సంవత్సరాలకి సైమన్ కి ఐపీఎల్ లో ఒక బాధ్యత అప్పగించారు. 2019 సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రధాన కోచ్ గా ఎంపికయ్యారు సైమన్. ఇప్పటికి కూడా ఆ పొజిషన్ లోనే కొనసాగుతున్నారు.