ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులను హడలెత్తించే బామ్మ ..చివరికి ఏమైందో చూస్తే నవ్వుకుంటారు.!

ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులను హడలెత్తించే బామ్మ ..చివరికి ఏమైందో చూస్తే నవ్వుకుంటారు.!

by Megha Varna

Ads

ముంబైకి చెందిన ఓ బామ్మ ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులను ముప్ప తిప్పలు పెట్టింది. వెంకటలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకోవడానికి బ్రిస్బేన్‌లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తుంది. తన వెంట తీసుకెళ్లిన లగేజ్ బ్యాగ్ పై ఒక అక్షరం తేడాగా రాయడంతో ఎయిర్ పోర్ట్ అధికారులకు చుక్కలు కనపడ్డాయి… ఎయిర్‌పోర్టులో దిగంగానే బామ్మ లగేజ్‌పై ఉన్న విషయాన్ని చూసిన అధికారులు హడలి పోయారు. ప్రయాణికుల సామన్లలో ఒక బ్యాగు మీద ‘బాంబ్‌ టు బ్రిస్బేన్‌’ అని రాసి ఉంది. ఇది గమనించిన ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీస్‌ బ్యాగ్‌ను తనిఖీ చేయవలసిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించాడు.ఇంతలో ఓ నడివయస్సు మహిళా ప్రయాణికురాలు ఆ బ్యాగ్‌ తనదేనంటూ పోలీసుల వద్దకు వచ్చింది.

Video Advertisement

పోలీసులు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి  విచారించారు. ముంబాయి నుంచి బ్రిస్బేన్‌ వెళ్తున్న ఆ ప్రయాణికురాలి పేరు వెంకటలక్ష్మి(65). పోలీసులు ఆమెను బ్యాగు తెరిచి చూపించాల్సిందిగా ఆదేశించారు. బ్యాగులో ప్రమాదకరమైనవి ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

మరి బ్యాగ్‌ మీద ఎందుకు ‘బాంబ్‌’ అని రాసి ఉంది అని అడగ్గా తాను ‘బాంబే’ అని రాయాలనుకున్నాను, కానీ స్థలం లేకపోవడంతో ‘వై’ ని రాయకుండా వదిలేసాను. దాంతో ‘బాంబే’ కాస్తా ‘బాంబ్‌’ గా మారిందని వివరించింది.  బ్యాగును మరిచిపోతానేమో అని దానిపై ‘బాంబే టు బ్రిస్బేన్‌’ అని రాయాలనుకుంది. కానీ స్థలం సరిపోక ‘బాంబ్‌ టు బ్రిస్బేన్‌’ అని రాసింది. అక్షరం తేడా వల్ల ఇంత జరిగింది . 


End of Article

You may also like