విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి రానాలు ఇద్దరు కలిసి మొదటిసారి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది బాగా ఏ కంటెంట్ కలిగిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో బాగా విమర్శలు వచ్చాయి. అసలు కుటుంబంతో కలిసి వెబ్ సిరీస్ చూడగలమా అంటూ పలువురు కామెంట్లు చేశారు. క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే ఈ వెబ్ సిరీస్లో వెంకటేష్,రానాలు తమ అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ 2023 జనవరి నుండి జూన్ వరకు అంటే ఈ ఆరు నెలల్లో ఎక్కువ వ్యూస్ సాధించుకున్న తమ కంటెంట్ వివరాలను ప్రకటించింది. ఈ లిస్టులో రానా నాయుడు వెబ్ సిరీస్ చోటు దక్కంచుకుంది. ఇండియా నుండి ఈ ఒక్క వెబ్ సిరీస్ ఏ ఉండడం విశేషం. టాప్ 400 లో రానా నాయుడు వెబ్ సిరీస్ 336 వ స్థానంలో ఉంది.
వెబ్ సిరీస్ కి 1.64 కోట్ల వ్యూయర్ షిప్ నమోదయింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ వెబ్ సిరీస్ ఘనత సాధించడం నిజంగా షాక్ కి గురి చేసే విషయమే.ఈ టాప్ 400 లో మొదటి స్థానంలో అమెరికన్ షో ది నైట్ ఏజెంట్ ఉంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి పార్ట్ 2 కూడా ఉందంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ పార్ట్ 2 లో ఇంకెంత వైలెన్స్ ఏ కంటెంట్ ఉంటుందో అంటూ అందరూ అనుకుంటున్నారు.








బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కీలక బాధ్యతలలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక కార్యదర్శిగా చేశారు. ఆ బాధ్యతతో పాటు నీటిపారుదల శాఖ విధులు కూడా చూసుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించిన పనులు మరియు మిషన్ భగీరథకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. ఆమె ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహిస్తూ, ప్రాజెక్ట్ లను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తూ ముఖ్యమైన పాత్రను పోషించారు. రాష్ట్రంలో డైనమిక్ ఆఫీసర్ గా స్మితా సబర్వాల్కు పేరుగాంచారు.
కాంగ్రెస్ ప్రభత్వం వచ్చినప్పటి నుండి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నుంచి పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయా శాఖల మినిస్టర్లను కలుస్తున్నారు. కానీ సీఎంఓకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ అయితే కనిపించట్లేదు. నీటి పారుదల శాఖ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల పై మొదటిసారిగా నిర్వహించిన సమీక్షకు సైతం స్మితా సబర్వాల్ హాజరవ్వకపోటం హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సమీక్షలన్నింటిలో కనిపించటం, పలు ప్రాజెక్టుల విధులను కూడా పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం కనిపించకపోవడానికి కారణాలేంటా అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకులు బిఆర్ఎస్ గవర్నమెంట్ తో పాటు ఆఫీసర్ల పై అవినీతి చేసారంటూ ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ల పేరుతో కోట్లు వెనుకేసుకుందంటూ ఆరోపణలు చేశారు. స్మితా సబర్వాల్ పైన కూడా కాంగ్రెస్ నాయకులు పలు సందర్భాల్లో అవినీతి ఆరోపణలు చేశారు. వాటి వల్లనే స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలవట్లేదన్న టాక్ వినిపిస్తోంది.


