అక్కినేని నాగార్జున, నాగ చైతన్య తల్లి లక్ష్మి ఎన్నో సంవత్సరాల క్రితం విడిపోయారు. కానీ నాగ చైతన్య, నాగర్జున తోనూ, లక్ష్మీ తోనూ క్లోజ్ గానే ఉంటారు. అంతే కాకుండా లక్ష్మి, నాగ చైతన్య తరచుగా కలుస్తూనే ఉంటారు. నాగ చైతన్య, సమంత పెళ్లికి కూడా లక్ష్మి హాజరయ్యారు. లక్ష్మి, చెన్నైకి చెందిన శరత్ విజయరాఘవన్ ని పెళ్లి చేసుకున్నారు.

శరత్ విజయరాఘవన్ సుందరం మోటార్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నారు. కొంత కాలం క్రితం నాగ చైతన్య, సమంత సింగపూర్ కి వెళ్లారు. ఈ ఫోటోలని సమంత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ ఫోటోలో నాగ చైతన్య సమంత తో పాటు లక్ష్మి, శరత్, ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.


వారిలో ఒకరు లక్ష్మీ, శరత్ కొడుకు. ఇంకొకరు ఆయన భార్య. లక్ష్మి, శరత్ వాళ్ళ కొడుకు పుట్టినరోజు కోసం సమంత, నాగచైతన్య సింగపూర్ కి వెళ్లారు. అంతే కాకుండా కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మి, శరత్ కొడుకు పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి నాగచైతన్య హాజరయ్యారు.


సమంత లక్ష్మి కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో సమంత లక్ష్మి గురించి ఆవిడ చాలా స్ట్రాంగ్ వ్యక్తిత్వం గల వ్యక్తి అని అన్నారు. వెంకటేష్ కూతురి వివాహానికి లక్ష్మి, నాగ చైతన్య, సమంత వెళ్లారు. వీరు ముగ్గురు కూర్చుని ఉన్న ఒక ఫోటోని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.





















సినిమా మొదలయ్యే ముందు స్టార్టింగ్ లో ఈ సినిమా 2014 సంవత్సరానికి ముందు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు అని వేస్తారు. పైన ఉన్న షాట్ భరత్ అనే నేను సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఒక నోట్.
పైన ఉన్న సీన్ “ఇది కలలా ఉన్నదే” పాట లోది. ఇందులో భరత్, వసుమతి సినిమా చూడడానికి వెళ్తారు. మనకు చూపించిన దాని ప్రకారం వాళ్లు చూసే పాట టైగర్ జిందా హై సినిమాలోది. అంటే వాళ్లు టైగర్ జిందా హై సినిమా చూస్తున్నారు. కానీ టైగర్ జిందా హై వచ్చింది 2017 లో.
ఏదేమైనా దీనివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. సినిమా అన్న తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరగడం అనేది సహజం. అయినా ఇది పరిగణలోకి తీసుకునే అంత పెద్ద పొరపాటు ఏమీ కాదు. సినిమా చూసినప్పుడు “అదేంటి? ఇది పొరపాటు ఏమో కదా?” అని అనిపిస్తుంది అంతే.




















