తమిళ్ లో చిన్న సినిమాగా విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించిన మూవీ లవ్ టుడే. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి తానే దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవాన నటించింది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలయ్యి మంచి వసూలు సంపాదించుకుంది. ఇవానాకు తెలుగులో కూడా మంచి మంచి ఆఫర్లు వచ్చాయి.
Actress Ivana in Love Today Movie Images HD
అయితే హీరోయిన్ ఇవాన రెండవ తమిళ్ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి.
ప్రముఖ దర్శకుడు బాలా శిష్యుడు మంద్ర వీర పాండియన్ దర్శకత్వంలో మదిమారన్ అనే చిత్రంలో నటిస్తుంది. వెంకట్ సెంగుట్టవన్ ఈ సినిమాలో హీరో. థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. డోంట్ జడ్జి ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనే సామెత ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని నమ్మకం ఉందని హీరోయిన్ ఇవాన ఆశాభావం వ్యక్తం చేసింది. నటి ఆరాధ్య, ఎంఎస్ భాస్కర్, ఆరుగళం నరేన్, బాబా చెల్లదురై, ప్రవీణ్‌కుమార్, సుదర్శన్, గోవింద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.
Ivana’s #Mathimaaran, A story like never before!
Releasing in theaters this December pic.twitter.com/YitgFWokXS
— Christopher Kanagaraj (@Chrissuccess) December 10, 2023