సాధారణంగా ఆదివారం రోజు అందులోనూ ముఖ్యంగా సాయంత్రం పూట అన్ని ఛానల్స్ లో సినిమాలు వేస్తారు. కానీ ఈటీవీ లో మాత్రం ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తారు. స్వరాభిషేకం ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది గాయకులు తమ పాటలతో మనల్ని అలరించారు. సామజవరగమన ప్రోగ్రాం ద్వారా ప్రతివారం కొంత మంది సింగర్స్ మన ముందుకు వస్తున్నారు. కారుణ్య, మంగ్లీ, సునీత, అనురాధ శ్రీరామ్, శ్రావణ భార్గవి,హరిణి తో పాటు ఇంకా ఎంతోమంది సింగర్స్ ఈ ప్రోగ్రాంలో పాడారు.
యూట్యూబ్ లో ఈ ఎపిసోడ్ చూస్తుంటే… సైనికుడు సినిమాలోని ఓరుగల్లుకే పిల్లా పాట వీడియో కనిపించింది. అందులో పాట కంటే కామెంట్స్ హైలైట్ గా ఉన్నాయి. అసలు పాడిన వారికంటే కొసరు పాడిన అమ్మాయినే ఎక్కువ పొగిడారు. సినిమా వెర్షన్ లో కార్తీక్, కారుణ్య, మాలతి, హరిణి పాడగా, ప్రోగ్రాంలో సినిమా వెర్షన్ లో పాడిన కారుణ్య, ఆదిత్య అయ్యంగార్, మంగ్లీ పాడారు.
watch video: >>>click here<<<
ఈ పాటని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. పాట చాలా బాగా పాడారు అని ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. అయితే కారుణ్య, ఆదిత్య అయ్యంగార్, మంగ్లీతో పాటు మరొక సింగర్ ని కూడా ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. పాటలో ఫిమేల్ పోర్షన్ లో కొంత భాగం కోరస్ సింగర్స్ లో ఉన్న ఒక సింగర్ పాడారు.
పాడింది కొంచెమే అయినా సరే చాలా బాగా పాడారు అంటూ యూట్యూబ్ లో ఎంతో మంది ఆ సింగర్ ని అభినందిస్తున్నారు. తన పేరు అభిక్య తనికెళ్ల. 2018 లో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐ ఫ్రేమ్స్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు అభిక్య తనికెళ్ల. అభిక్య బిఎస్సి చదివారు.
అభిక్య దాదాపు ఎనిమిది వందల కాన్సర్ట్స్ చేశారు. అభిక్య తనికెళ్ల దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యే ఆలాపన ద్వారా టీవీకి పరిచయమయ్యారు. తర్వాత పాడనా తెలుగు పాట, బోల్ బేబీ బోల్ లో పాడారు. అభిక్య తనికెళ్లకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. గణేశ పంచరత్నం పాడి, ఆ వీడియోని తన ఛానల్ లో అప్లోడ్ చేశారు అభిక్య.