తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల నుండి అగ్ర హీరోగా రాణిస్తున్నారు. 60 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా నటిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు హీరోగా సినిమాలు చేస్తున్నా, ఆయన కంటే ఎక్కువ జోష్ తో చిరంజీవినే ముందుకెళ్తున్నాడు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి, స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు. ఆయన కెరీర్ లో నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. చిరంజీవి కెరీర్ లో నటించిన ఉత్తమ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. రుద్రవీణ:
చిరంజీవి, శోభన జంటగా నటించిన సినిమా రుద్రవీణ. ఈ చిత్రానికి కె.బాలచందర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.
2. స్వయంకృషి:
చిరంజీవి హీరోగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమా స్వయంకృషి. ఈ మూవీలో హీరోయిన్ గా విజయశాంతి నటించింది.
3. ఆపద్బాంధవుడు:
చిరంజీవి, మీనాక్షి శేషాద్రి జంటగా నటించిన ఆపద్బాంధవుడు సినిమాకి కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కానప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా నాంది అవార్డ్ వచ్చింది.
4. చంటబ్బాయి:
చిరంజీవి, సుహాసిని జంటగా నటించిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రైవేటు డిటెక్టివ్‌గా చిరంజీవి నటించాడు.
5. విజేత:
చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన విజేత చిత్రాన్ని ఎ. కోదండరామి రెడ్డి తెరకెక్కించారు. అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
6. జగదేక వీరుడు అతిలోక సుందరి:
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సోషియో ఫాంటసీ మూవీని కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అపుర్వమైన విజయాన్ని అందుకుంది.
7. ముఠా మేస్త్రి:
చిరంజీవి హీరోగా, రోజా, మీనా హీరోయిన్లుగా నటించిన ముఠామేస్త్రీ మూవీకి ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా, చిరంజీవికి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది.
8. సైరా:
చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ మూవీని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు.
9. ఇంద్ర:
చిరంజీవి హీరోగా ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన ఇన్ద్ర మూవీని బి గోపాల్ తెరకెక్కంచారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి టాప్ 10 సినిమాలలో ఇది ఒకటి.
10. అభిలాష:
చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అభిలాష అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
11. ఛాలెంజ్:
చిరంజీవి, సుహాసిని, విజయశాంతి నటించిన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించారు.
12. యముడికి మొగుడు:
చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా రాధ, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
Also Read: “చిరంజీవి, బాలకృష్ణ” లు… “రజనీకాంత్, కమల్ హాసన్” ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటా..?

యాంకర్ ఓంకార్ స్థిరపడిన తరువాత హిందీ టీవీ డ్యాన్స్ షోలు మాత్రమే ఉన్న సమయంలో వాటి మాదిరిగానే ఒక కాన్సెప్ట్ తో తెలుగులో డాన్స్ షోను నిర్మించాడు. ఆ షో పేరు ఆట. ఈ షో అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. రెండు సీజన్ల తరువాత ఆట జూనియర్స్ మొదలుపెట్టాడు. దీని అందరూ చిన్నపిల్లలే పోటీ పడతారు. ఈ డ్యాన్స్ షో కూడా చాలా పాపులర్ అయ్యింది. ఆట జూనియర్స్ 7 వరకు ఈ షో ప్రసారం అయ్యింది.
అయితే ఆట జూనియర్స్ 5 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బిట్టు అనే అబ్బాయి, ఒక్క డ్యాన్స్ తో మాత్రమే కాకుండా తన మిమిక్రీతో కూడా ఆకట్టుకున్నాడు. బిట్టు చాలామంది అభిమానచేవారు. ఆట జూనియర్స్ 5 ఎంటర్టైన్మెంట్ ట్రోఫిని అందుకున్నాడు. అతన్ని ఆటబిట్టు అని పిలుస్తుంటారు. ఆ తరువాత ఛాలెంజ్ డాన్స్ షో 3 పాల్గొని విన్నర్ అయ్యాడు.
ఈటీవీలో ప్రసారం అయిన ఆటైనా పాటైనా దేనికైనా రెడీలో పాల్గొన్న బిట్టు విజేతగా నిలిచాడు. ఆ తరువాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన కిరాక్ కిడ్స్ లో కూడా పాల్గొన్నాడు. వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, కమలతో నా ప్రయాణం వంటి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు పెద్దగా యిన బిట్టు డ్యాన్సర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.
పైన ఫోటోలో సైకిల్ మీద కూర్చున్న చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాకుండా ఇతని తమ్ముడు కూడా హీరోనే. అతని తండ్రి టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. ఈ హీరో తండ్రి నాన్న కూడా ఒకప్పుడు తెలుగులో ప్రముఖ నటుడిగా రాణించి, కాలం చేశారు. ఈ హీరో తన స్టైల్ తో ఆకట్టుకుని స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ హీరోకి అమ్మాయిల ఫోలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ ‘పుష్ప 2’ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ తో మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
కొత్త తరహ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో అమ్మాయిలు వరుగా అపహరణకు గురవుతుంటారు. సుమారు 16 మంది కనిపించకపోవడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం కేరళ నుండి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను సిటీకి రప్పిస్తారు. అప్పటికే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసు ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) తో పాటు ఆద్య కూడా విచారణ మొదలుపెడుతుంది.
తప్పిపోయిన అమ్మాయిలకు ఏమైంది? అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో నివసించే గిరిజన తెగ హిడింబాలకు ఉన్న సంబంధం ఏంటి? ఆద్య, అభయ్ ఈ కేసును చేధించారా? అనేదే మిగతా కథ. ఎంచుకున్న కథ ఎంత గొప్పది అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా ఆడియెన్స్ కి అర్థం కాకపోతే ఆ మూవీతో కనెక్ట్ కాలేరు. ఈ మూవీలో అదే జరిగింది.
నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ, వర్తమానంలో జరిగే సీన్స్ చూపించడంతో స్టోరీ ఎక్కడ నడుస్తుందో అర్థం కాకపోవడం ఆడియెన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
అసలు స్టోరీ సెకండాఫ్‌లో చూపించారు. హిడింబ తెగ నేపథ్యం, హైదరాబాద్ లో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు కనెక్షన్ ఉండడం, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేస్తుంది. అయితే డైరెక్టర్ పలు చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఉపయోగించుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.
మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఇష్టపడని ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఈరోజు (ఆగస్టు 11) థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ వేదళం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెళ్ళుగా నటించారనే విషయం తెలిసిందే.
భోళా శంకర్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు. కొందరు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సన్నివేశాలు పర్వాలేదని చెబుతున్నారు. ఇంటర్వెల్ బాంగ్ తో ప్రధమార్ధం పర్వాలేదని అంటున్నారు
అయితే ఈ చిత్రంలో చిరంజీవి, హీరోయిన్ తమన్నా మధ్యలో పెట్టిన లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని, అలాగే ఖుషి నడుము సీన్ కూడా అంతగా సెట్ అవలేదని, భోళా శంకర్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కలెక్షన్ రావడం లేదని సమాచారం. ఎందుకంటే ఓవర్సీస్లో అతి తక్కువ ఏరియాలలోనే ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రధానంగా యూఎస్‌లో 309 లొకేషన్లలో ఈ మూవీ ప్రీమియర్ షోలను వేశారు. దాంతో 308K డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో 2.54 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన తరువాత నటించిన సినిమాలు ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ సాధించాయి. వాటితో పోలిస్తే ‘భోళా శంకర్’ సినిమా తక్కువ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ ప్రీమియర్ వసూళ్లతో ‘భోళా శంకర్’ కలెక్షన్స్ పొలుస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా బాలయ్య సినిమా 708k డాలర్లను కలెక్ట్ చేసిందని, చిరంజీవి మూవీ దానిలో సగం కూడా వసూల్ చేయలేదని అంటున్నారు.
#1 జీ 5




గతంలో మెహర్ రమేష్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీసినప్పటికీ, అవి హిట్ అందుకోలేకపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మంచి కమ్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే షోలు పడడంతో మూవీ చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
భోళా శంకర్ సినిమాను చూసినవారు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఈ మూవీ లోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో కూడిన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సామాజిక మధ్యమాలలో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జైలర్ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో రజనీకాంత్ భార్య పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించింది. ఈ మూవీలో కీలకమైన రజిని కాంత్ కొడుకు అర్జున్ పాత్రలో తమిళ హీరో వసంత్ రవి నటించారు. ఈ చిత్రం వసంత్ నటించిన నాలుగవ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ అశ్విన్స్ లో హీరోగా వసంత్ రవి నటించారు.
వసంత్ రవి అసలు పేరు వసంత్ కుమార్ రవి. ఇతను హీరో మాత్రమే కాదు డాక్టర్ కూడా. చెన్నై లో ఫేమస్ రెస్టారెంట్ అయిన ‘నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్’ చైర్మన్ రవి ముత్తుకృష్ణన్ కుమారుడు వసంత్ రవి. 2017లో మొదటిసారి అతను ‘తారామణి’ అనే చిత్రంలో నటించాడు.
ఆ మూవీ హిట్ అయ్యింది. ఆ మూవీలోని నటనకు గాను వసంత్ ఉత్తమ నటుడుగా విజయ్ అవార్డ్ మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు. అతను నటించిన రెండవ సినిమా ‘రాకీ’ ఈ మూవీకి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత హర్రర్ మూవీ ‘అశ్విన్స్’ లో హీరోగా నటించిన వసంత్ ‘జైలర్’ మూవీలో అర్జున్ అనే ఏసీపీ పాత్రలో మెప్పించారు.
మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మూవీలో మహేష్ నటన, డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘కళావతి’ పాట అయితే ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు.
ఈ పాటకు చాలా మంది సెలెబ్రిటీలు కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ మూవీలో మహేష్ బాబు బ్యాంక్ గురించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ ను గతంలో వచ్చిన ఒక మూవీలో వేరే హీరో చెప్పడం విశేషం. ఆ హీరో చెప్పిన డైలాగ్ కు సంబంధించిన వీడియోను ట్రోల్ ప్లాజా అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
ఆ డైలాగ్ చెప్పిన హీరో శ్రీకాంత్, నిన్నే ప్రేమిస్తా మూవీలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. అక్కడి ప్రజలకి “డబ్బు అంటే లక్ష్మీ, ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంక్ లో కదా! ఆ బ్యాంక్ గుడి లాంటిది. అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని చెప్తారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.