బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగింపు దశకు వచ్చేసింది. ఇక అందరూ కూడా ఫినాలే ఎపిసోడ్ గురించి ఎదురుచూస్తున్నారు. 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఆఖరి ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరిలో సిరి, షణ్ముక్ మానస్, శ్రీరామ్, సన్నీ ఉండగా ఒకరు మాత్రమే విజేత అవుతారు.
అయితే ఎవరు ట్రాఫీని గెలుచుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో సిరిని అనూహ్యంగా ఎలిమినేట్ అంటూ ప్రకటించారు. దీనితో సిరి ఏడ్చేసింది. కాస్త బాధ పడిన తర్వాత మళ్ళీ హౌస్ లోకి సిరీని తీసుకొచ్చారు. ఇక ఫినాలే దగ్గర పడడంతో విజేత ఎవరు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సన్నీ, శ్రీరామ్ మధ్య గట్టి పోటీ జరిగే లాగ కనబడుతోంది. అయితే ఈసారి ఆఖరికి శ్రీరామ్, సన్నీ మిగులుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు. సన్నీ విన్ అవుతాడని కొంతమంది అంటే శ్రీరామ్ గెలుస్తాడని మరి కొంతమంది అంటున్నారు. షణ్ముఖ్, మానస్ కూడా ఆఖరి వరకు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనేది తెలుసుకోవాలంటే ఆగాల్సిందే.