Home News అదృష్టం అంటే ఇతనిదే ఏమో..! రాత్రికి రాత్రే “కోటీశ్వరుడు” అయిన ఆటో డ్రైవర్..! ఎలా అంటే..?

అదృష్టం అంటే ఇతనిదే ఏమో..! రాత్రికి రాత్రే “కోటీశ్వరుడు” అయిన ఆటో డ్రైవర్..! ఎలా అంటే..?

by Mohana Priya

కొన్ని సార్లు మనిషికి అదృష్టం ఏ రకంగా వస్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఎలాంటి ఆశ లేకుండా సాధారణంగా ఉన్న వ్యక్తికి అనుకోకుండా అదృష్టం వచ్చి మంచి స్థాయికి వెళ్లొచ్చు. ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఇలాంటివి సాధారణంగా సినిమాల్లో చూస్తాం. కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరిగింది. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన ఆటో డ్రైవర్ అనూప్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యి 25 కోట్ల రూపాయలను సంపాదించారు.

30 సంవత్సరాల అనూప్ తిరువనంతపురంలో ఉన్న శ్రీ వరాహంలో ఆటో నడుపుతూ ఉంటారు. అనూప్ ఓనం సందర్భంగా 500 రూపాయలు పెట్టి భగవతి ఏజెన్సీ నుండి ఒక లాటరీ టికెట్ కొన్నారు. ఆ లాటరీ టికెట్ లో గెలిచిన వాళ్ళ వివరాలని ఇటీవల విడుదల చేశారు. అందులో అనూప్ 25 కోట్లు గెలుచుకున్న తెలిసింది. ఇది తెలుసుకున్న తర్వాత అనూప్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. అనూప్ కి వచ్చిన 25 కోట్ల రూపాయల్లో టాక్స్ అంతా కట్ అయిన తర్వాత 15 కోట్ల 75 లక్షల రూపాయలు వస్తాయి.

auto driver from kerala won 25 crores lottery

ఈ విషయం తెలుసుకున్న తర్వాత అనూప్ ఇంటి చుట్టూ మీడియా వాళ్ళు వచ్చేశారు. ఇంత పెద్ద లాటరీ గెలుచుకోవడం ఎలా ఉంది అంటూ అనూప్ ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. దీంతో సడన్ గా అనూప్ చాలా పాపులర్ అయిపోయారు. ఈ విషయంపై అనూప్ మాట్లాడుతూ, “నేను స్నానం చేసి వచ్చి రిజల్ట్ చూసుకున్నాను. అది చూసి నేను షాక్ అయ్యాను. దాంతో నా భార్య ని కూడా నేను ఒకసారి మళ్ళీ చూడమని చెప్పాను. ఇప్పటికి కూడా నాకు కొంచెం టెన్షన్ గా ఉంది” అని చెప్పారు.

auto driver from kerala won 25 crores lottery

తన తండ్రి, సోదరి చనిపోయిన తర్వాత ఆర్థికంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఇది వాళ్ళ జీవితాలని మారుస్తుంది అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే అనూప్ తన సోదరి ఏజెన్సీ నుండి ఈ టికెట్ తెచ్చుకున్నారు. అప్పుడు కూడా డబ్బులు సరిపోకపోవడంతో తన కొడుకు దాచుకున్న డబ్బులో నుండి కొంత మొత్తాన్ని తీసుకొని లాటరీ టికెట్ కొన్నారు. ఇప్పుడు లాటరీ గెలవడంతో అనూప్ చాలా సంతోషంగా ఉన్నారు.

You may also like