Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
Video Advertisement
ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అయితే ఇటీవల జబర్దస్త్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రోగ్రామ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇటీవల సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. వీటన్నిటికీ స్పందిస్తూ హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సుధీర్ ప్రోగ్రాం విడిచి వెళ్లి పోవడానికి గల కారణాన్ని రామ్ ప్రసాద్ చెప్పారు.
రాంప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ, సుధీర్ 2 సంవత్సరాల క్రితమే జబర్దస్త్ వదిలి వెళ్లాల్సింది అని, కానీ వారి స్నేహం కోసం కలిసి చేద్దాం అని అనుకున్నారు అని అన్నారు. సుధీర్ జబర్దస్త్ విడిచి వెళ్లడానికి గల కారణం సుధీర్ సినిమాలు చేయడం, మంచి అవకాశాలు రావడం, దాంతో సినిమాల్లో బిజీ అవ్వడం అని అన్నారు. అలాగే సుధీర్ కి ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోవాలి అని ఉంది దాంతో మంచి ఆఫర్ రావడంతో వెళ్ళారు అని అన్నారు. అయినా కూడా సుధీర్ ఇప్పటికీ మల్లెమాలని గౌరవిస్తారు అని రామ్ ప్రసాద్ చెప్పారు.
watch video :
End of Article