Avatar 2 Review : ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన “అవతార్ 2” ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Avatar 2 Review : ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన “అవతార్ 2” ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2)
  • నటీనటులు : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్.
  • నిర్మాత : జేమ్స్ కామెరాన్, జోన్ లాండౌ
  • దర్శకత్వం : జేమ్స్ కామెరాన్
  • సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్
  • విడుదల తేదీ : డిసెంబర్ 16, 2022

avatar 2 movie review

Video Advertisement

స్టోరీ :

మొదటి భాగానికి కొనసాగింపుగానే ఈ కథ సాగుతుంది. పూర్తిగా నావి మనిషి లాగా మారిన జేక్ (సామ్ వర్తింగ్టన్) తన కుటుంబంతో పాటు వేరే చోటికి వెళ్లిపోతాడు. అక్కడి మనుషుల్లో ఒకరిలాగా కలిసిపోతాడు. ఇక్కడ నీటిలో ఒక సంపద ఉంటుంది. ఆ సంపదని తీసుకోవడానికి ఒక సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుంది. వారిని జేక్ ఎలా అడ్డుకుంటాడు? తన తర్వాత జనరేషన్ వాళ్లతో కలిసి ఎలా పోరాడుతాడు? వారంతా ఆ సంస్థపై ఎలా ఎదురుతిరిగారు? వారు చేసే పనులన్నీ ఎలా ఆపారు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

avatar 2 movie review

రివ్యూ :

అంత ఎక్కువ అంచనాలు లేకుండా విడుదల అయిన మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. దాంతో ఈ సినిమా రెండవ భాగం కోసం ప్రపంచమంతా ఎదురుచూసింది. దాదాపు మొదటి భాగం విడుదల అయిన 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాకి ముఖ్య హైలైట్ మాత్రం గ్రాఫిక్స్. మొదటి భాగం కంటే కూడా ఈ సినిమాలో గ్రాఫిక్స్ పరంగా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు అని అనిపిస్తుంది.

avatar 2 movie review

ఈ సినిమా 5 భాగాలుగా ఉంటుంది. అందులో రెండవ భాగం ఇప్పుడు విడుదల అయ్యింది. ఈ సినిమాలో ముఖ్యంగా చివరిలో వచ్చే ఫైటింగ్ సీన్ మాత్రం సినిమా మొత్తానికి ఒక పెద్ద హైలైట్ అయ్యింది. అలాగే అండర్ వాటర్ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా దర్శకుడు పడిన శ్రమ, కష్టం ఆయన చిన్న విషయాలపై కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నారు అనేది ప్రేక్షకులకి అర్థం అవుతూ ఉంటుంది.

avatar 2 movie review

ఇంక తెలుగు సినిమా విషయానికి వస్తే ప్రముఖ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. డబ్బింగ్ సినిమా అంటే డైలాగ్స్ ఏదో అతికించినట్టుగా ఉంటాయి. కానీ ఈ సినిమా డైలాగ్స్ కూడా సాధారణంగానే అనిపిస్తాయి. దాంతో తెలుగులో చూసినా కూడా సినిమా ఫీల్ ఏ మాత్రం తగ్గదు.

ప్లస్ పాయింట్స్ :

  • నిర్మాణ విలువలు
  • ఫైటింగ్ సీన్స్
  • నీటిలో చూపించిన సీన్స్
  • క్లైమాక్స్

రేటింగ్ :

4/5

ట్యాగ్ లైన్ :

సాధారణంగా మొదటి భాగం పెద్ద హిట్ అయితే, ఆ అంచనాలని రెండవ భాగం చేరుకుంటుందా లేదా అనే అనుమానం ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం అంచనాలకు మించి ఉంది. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా అవతార్ 2 ప్రేక్షకులని అస్సలు నిరాశపరచదు. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది.


End of Article

You may also like