Ads
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకోవడంతో సినీ ప్రపంచమంతా విషాదంలో మునిగిపోయింది.చాలాకాలం నుండి డిప్రెషన్ తో బాధపడడం వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే సుశాంత్ మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.
Video Advertisement
ఇది ఇలా ఉండగా…bollywood insider జూన్ 7 న ఒక వింత ట్వీట్ చేసింది. సినిమాలలో నటించేందుకు గాను ప్రొడ్యూసర్లను ఎక్కువ పారితోషకం ఇవ్వాలని ఆ నటుడు డిమాండ్ చేసారని. అంతేకాకుండా తన గర్ల్ ఫ్రెండ్ కు కూడా సినిమాలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసారని ఆ ట్వీట్ సారాంశం.
అయితే ఆ ట్వీట్ లో సుశాంత్ గురించి అని ఎక్కడ చెప్పలేదు. కానీ కామెంట్స్ లో మాత్రం కొందరు సుశాంత్ గురించే అంటున్నారు. అదే అతన్ని ఆత్మహత్యవరకు నడిపించి ఉండచ్చు అంటున్నారు. మరికొందరు ఆ ట్వీట్ పై విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా వాస్తవాలు తెలియకుండా మన మధ్యలేని వ్యక్తి గురించి తప్పుగా అయితే అనకూడదు. అందుకే సుశాంత్ ఫాన్స్ ఆ ట్వీట్ డిలీట్ చేయమని అంటున్నారు. కొందరేమో అది నిజమై ఉండొచ్చు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సుశాంత్ ప్రవర్తన వలన తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అయ్యారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ ట్వీట్స్ ఏంటో మీరే చూడండి. ఇది ఎంత వరకు నిజమో తెలీదు. కానీ ఓ మంచి నటుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకొని మనకి దూరం అవ్వడం చాలా బాధాకరమైన విషయం. అతని ఆత్మకు శాంతిచేకూరాలని ఆశిస్తూ…#RIP SUSHANTH SINGH RAJPUT
End of Article